Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'డేగల బాబ్జీ'. వెంకట్ చంద్రని దర్శకుడిగా పరిచయం చేస్తూ, రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ, 'తెలుగు స్క్రీన్ మీద తొలిసారి సింగిల్ యాక్టర్‌తో చేసిన సినిమా ఇది. సినిమాలో మిగతా క్యారెక్టర్లు ఉన్నప్పటికీ కేవలం వాళ్ల వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. డేగల బాబ్జీ పాత్రలో బండ్ల గణేష్ ఫెంటాస్టిక్‌గా నటించారు. ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ట్రైలర్కూ మంచి స్పందన లభిస్తోంది. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం' అని తెలిపారు.
'విడుదలైన ట్రైలర్లో మర్డర్ కేసులో అనుమానితుడిగా బండ్ల గణేష్‌ను పరిచయం చేశారు. ట్రైలర్ అంతా ఆయన ఒక్కరే ఉన్నారు. 'యాభై దెయ్యాలు సార్... అవి నన్ను బెదిరిస్తున్నాయి. భయపెడుతున్నాయి', 'పొట్టిగా ఉన్నా... మా అమ్మ అందంగా ఉంటుంది?'... అని బండ్ల గణేష్ చెబుతున్న డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో విడుదల కానుంది' అని చిత్ర యూనిట్ పేర్కొంది.