Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం 'కపట నాటక సూత్రధారి'. క్రాంతి సైనా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మనీష్ (హలీమ్) నిర్మించారు. ఈ సినిమా ఈనెల 12 న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది.
ఈ సందర్బంగా 'నాంది' చిత్ర దర్శకుడు విజయ్ కనకమేడల మాట్లాడుతూ,'ఈ సినిమా చేసిన దర్శక, నిర్మాతలకు ఆల్ ది బెస్ట్. దర్శకుడు క్రాంతి నాకు చాలా సన్నిహితుడు. మేమిద్దరం ఎన్నో సినిమాలు కలిసి చేశాం. ఇప్పుడు నా స్నేహితుడు దర్శకుడు కావడం ఆనందంగా ఉంది. నిర్మాత మనీష్ కూడా నా ఆప్త మిత్రుడు. వీరిద్దరూ ఓ మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నారు. తప్పకుండా అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను' అని చెప్పారు.
'శివారెడ్డి సోదరుడిగా సినిమాల్లోకి వస్తున్నాను. శివారెడ్డి గారి అన్ని పనులు చూస్తున్నాను. నేనెప్పుడూ స్టేజి ఎక్కుతాను అని అప్పుడప్పుడు అనుకునేవాడిని.. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. నేను ఇంతవరకు రావడానికి కారణం అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ చిత్రం తప్పకుండా ప్రతి ఒక్కరినీ అలరిస్తుందన్న నమ్మకం నాకుంది' అని నటుడు సంపత్ కుమార్ అన్నారు. హీరో విజరు శంకర్ మాట్లాడుతూ, 'నన్ను హీరోగా ఎంపిక చేసి, అవకాశం ఇచ్చిన దర్శకుడికి, నిర్మాతకి కతజ్ఞతలు. ఇది చాలా మంచి కథ. తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది. దర్శకుడు ఎంతో కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించాడు. నిర్మాతలు ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకాడలేదు' అని తెలిపారు.
'నన్ను, నా కథను నమ్మి ఈ సినిమాను ఇంత వరకు తీసుకొచ్చిన నిర్మాతకి ధన్యవాదాలు. కథ మీద నమ్మకంతోనే ఈ సినిమాకు ఆయన భారీగా ఖర్చు పెట్టారు. అంత మంచి ప్రొడ్యూసర్ దొరకడం నా అదష్టం. పాత్రకి తగ్గట్టు హీరో విజరు శంకర్ చాలా బాగా నటించాడు' అని దర్శకుడు క్రాంతి సైనా అన్నారు. నిర్మాత మనీష్ మాట్లాడుతూ, 'కథ వినగానే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయాలనిపించింది. దర్శకుడు కథ చెప్పిన విధానం, తెరకెక్కించిన విధానం ఎంతో ఆకట్టుకుంది. హీరో విజరు శంకర్ ఈ సినిమాతో అందర్నీ బాగా అలరిస్తారు. ఆయనతోపాటు ఇందులో నటించిన అందరూ తమ నటనతో ప్రేక్షకులను కచ్చితంగా మెప్పిస్తారు. అన్ని విభాగాల టెక్నిషియన్స్ చాలా బాగా పని చేశారు. ఈ సినిమాను ఈనెల 12 న చూసి, ప్రేక్షకులు హిట్ అందించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.