Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'భారతీయ వారసత్వాన్ని, సంస్కతిని తమ కళల ద్వారా సంరక్షించేందుకు కషి చేస్తున్న స్థానిక కళాకారులకు సాధికారత కల్పించడానికి 'ఈకే'ని సష్టించాం. దీని కోసం రోపోసోతో భాగస్వామి కావడం ఆనందంగా ఉంది' అని బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ అన్నారు. గ్లాన్స్ అండ్ కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్వర్క్ ద్వారా ఏర్పడిన జేవీ కంపెనీ గ్లాన్స్ కలెక్టివ్ ద్వారా ప్రారంభమైన మొట్ట మొదటి బ్రాండ్ 'ఈకే'. దీన్ని నిర్మాత ఏక్తా కపూర్ ప్రముఖ కంటెట్ ఫ్లాట్‌ఫామ్ రోపోసోతో కలిసి సంయుక్తంగా ఆరంభించారు.
గహాలంకరణ, గహౌపకరణాలు, వెల్నెస్ ఉపకరణాలు వంటి వర్గాలలో సాంప్రదాయ, సమకాలీన డిజైన్‌తో ఉండే ఉత్పత్తులు 'ఈకే' ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు చేరనున్నాయి. 'ఈకే' బ్రాండ్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న స్థానిక కళాకారుల సహకారంతో అనేక రకాల ఉత్పత్తులు రూపొందనున్నాయి. మన దేశంలో చక్కటి నైపుణ్యం కలిగిన కళాకారుల వారసత్వాన్ని ప్రోత్సహించడం, సంరక్షించడం కూడా 'ఈకే' మిషన్‌లో భాగం కావడం విశేషం. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత ఏక్తా కపూర్ మాట్లాడుతూ, 'రోపోసోతో భాగస్వామ్యం చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. 'ఈకే' ద్వారా స్థానిక కళాకారుల పనితనం గురించి ప్రపంచంలోని ప్రతి ఒక్క వినియోగదారుడికి చేరేలా గ్లాన్స్, రోపోసో వంటి ప్లాట్‌ఫామ్‌లు కృషి చేస్తున్నాయి. అలాగే 'ఇకే' ఆరోగ్యానికి సంబంధించిన లోతైన జ్ఞానాన్ని విస్తరించడంలో కూడా సహాయపడుతుంది' అని తెలిపింది. గ్లాన్స్ ఇన్‌మొబి గ్రూప్ వ్యవస్థాపకుడు, సీఈఓ నవీన్ తివారీ మాట్లాడుతూ, 'సెలబ్రిటీలు, క్రియేటర్ల వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే బ్రాండ్ల సష్టిలో భాగస్వామ్యం కావడమే మా ఉద్దేశం. ఏక్తా కపూర్‌తో కలిసి 'ఈకే'లో భాగస్వామ్యులం కావడం ఎంతో సంతోషంగా ఉంది. సృజనాత్మక, ఆరోగ్యం పట్ల, జీవన శైలి పట్ల ఆమెకు ఉన్న అవగాహన అపారం' అని చెప్పారు.