Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తికేయ హీరోగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి.టి సమర్పణలో '88' రామారెడ్డి నిర్మించిన సినిమా 'రాజా విక్రమార్క'. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించిన సుధాకర్ కోమాకుల బుధవారం మీడియాతో మాట్లాడుతూ,'ఈనెల 12 నాకెంతో స్పెషల్. ఎందుకంటే నా పుట్టినరోజుకి నేను కీలక పాత్ర పోషించిన 'రాజా విక్రమార్క' సినిమా విడుదలవుతోంది. నిజంగా ఇది నాకు స్పెషల్ మూమెంట్. దర్శకుడు శ్రీ సరిపల్లి సుమారు పదేళ్లు నుంచి తెలుసు. అమెరికాలో చాలా సినిమాలకు పని చేశాడు. అక్కడ నన్ను రెండు మూడు సినిమాలకు ఆడిషన్ కూడా చేశాడు. ఓ రోజు ఫోన్ చేసి 'నువ్వు ఓ రోల్ చేయాలి' అన్నాడు. నా పాత్ర అద్భుతంగా అనిపించి, గ్రీన్‌సిగల్ ఇచ్చేశా. ఇందులో గోవింద్ అని ఏసీపీ రోల్ చేశా. హౌమ్ మినిస్టర్ చీఫ్ సెక్యూటిరీ ఆఫీసర్. ఇప్పటివరకూ సరదా పాత్రలు చేశా. ఇందులో నా పాత్ర చాలా సీరియస్‌గా ఉంటుంది. అలాగే నా పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. మంచి పేరు తీసుకొచ్చే పాత్ర చేశానని సంతృప్తిగా ఉంది. ప్రస్తుతం హీరోగా 'నారాయణ అండ్ కో', 'జీడీ' (గుండెల్లో దమ్ముంటే)తోపాటు మరో సినిమా కూడా ఓకే అయ్యింది. సుఖ మీడియా పేరుతో బ్యానర్ స్టార్ట్ చేశా. మంచి కథలు వస్తే ఇతరుల భాగస్వామ్యంతోనూ సినిమాలు నిర్మిస్తా. రీసెంట్గా ఒక ఇండిపెండెంట్ సాంగ్ చేశా. ఇందులో నాకు జోడీగా '30 వెడ్స్ 21' ఫేమ్ అనన్య నటించారు. విజరు బుల్గానిన్ మ్యూజిక్ చేశారు. 'గాలి సంపత్' నిర్మాత సాయికష్ణ ప్రొడ్యూస్ చేశారు. త్వరలోనే ఈ పాటని విడుదల చేస్తాం' అని తెలిపారు.