Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త సినిమా 'పుష్పక విమానం'. గీత్ సైని, శాన్వీ మేఘన నాయికలు. ఈ చిత్రాన్ని దామోదర దర్శకత్వంలో కింగ్ అఫ్ ది హిల్ ఎంటర్ టైన్మెంట్స్, టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ, విజరు మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మాతలు. ఈనెల 12న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హీరో ఆనంద్ దేవరకొండ బుధవారం పాత్రికేయులతో ముచ్చటించారు.
ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..'దర్శకుడు దామోదర మా అన్నయ్య విజరుకు స్నేహితుడు. ఆయన చెప్పిన కథ బాగా మా అందరికీ నచ్చింది. మొదట వేరే హీరోలతో ఈ సినిమా చేద్దామనుకున్నాం. కానీ కుదరలేదు. పాత్ర పరంగా టెస్ట్ షూట్ చేసిన తర్వాత నేనే హీరోగా నటించాల్సి వచ్చింది. టీచర్‌గా పని చేసే చిట్టిలంక సుందర్ అనే వ్యక్తి పెళ్లి మీద చాలా ఆశలు పెట్టుకుంటాడు. కానీ పెళ్లయ్యాక అతని ఆశలన్నీ తలకిందులు అవుతాయి. భార్య లేచిపోతుంది. కానీ ఆ విషయం మీద పోలీస్ కంప్లైంట్స్ ఇవ్వలేక తనే వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో హీరోకు కోపం, ఫ్రస్టేషన్ వస్తుంటాయి. చూసే వాళ్లకు కూడా హీరో మీద జాలి కలుగుతుంది. చిట్టిలంక సుందర్‌గా నటించినందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నా. ఈ సినిమా చూసిన తర్వాత చిట్టిలంక సుందర్‌గా అందరికీ గుర్తుండిపోతా. నటన పరంగా మరో లెవెల్‌కి తీసుకెళ్ళే సినిమా ఇది. నా క్యారెక్టర్ చాలా పద్ధతిగా, సైలెంట్‌గా ఉంటే హీరోయిన్ శాన్వి క్యారెక్టర్ చాలా బబ్లీగా, హుషారుగా ఉంటుంది. సునీల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో కనిపిస్తారు. ఆయన ఎంతగా నవ్విస్తారో.. అంతగా భయపెడతారు కూడా. పెళ్లి అనేది మన సమాజానికి దొరికిన ఒక సంప్రదాయం. పెళ్లి వల్ల మన లైఫ్‌కు ఒక బాండింగ్, ఒక పర్పస్, ఒక సర్కిల్ ఏర్పడతాయి. ఈ సినిమాలో పెళ్లి గురించి ఓ మంచి విషయాన్ని చెప్పబోతున్నాం. దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని చాలా క్లారిటీగా, ఎంటర్ టైనింగ్‌గా తెరకెక్కించాడు. అన్నయ్య విజరుకు సినిమా బాగా నచ్చింది. అందుకే ఈ సినిమాను బాగా ప్రమోట్ చేద్దామని ముందుకొచ్చాడు' అని చెప్పారు.
రెగ్యులర్ హీరోగా ఉండకూడదు అనేది నా ఉద్దేశం. నా కథల ఎంపికలో అన్నయ్య ప్రమేయం ఉండదు. నేనే సెలెక్ట్ చేసుకుంటా. కేవీ గుహన్, సాయి రాజేశ్ వంటి దర్శకులతో ప్రస్తుతం సినిమాలు చేస్తున్నా. వీటిలోనూ నా క్యారెక్టర్స్ సహజంగా, మన చుట్టూ ఉండే అబ్బాయిలా ఉంటాయి.