Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యమ నాయకుడిగా శ్రీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'తెలంగాణ దేవుడు'. జిషాన్ ఉస్మాన్ హీరోగా పరిచయం అవుతున్నారు. హరీష్ వడత్యా దర్శకుడు. మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మాత. ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదలవుతోంది.
ఈ సందర్భంగా హీరో జిషాన్ ఉస్మాన్ మీడియాతో మాట్లాడుతూ, 'తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి బయోపిక్ అని తెలిసి ఈ సినిమా చేశాను. ఓ ఉద్యమకారుడుగా ఆయన పోరాడిన విధానం అందరికీ తెలిసిందే.
అదే నన్ను బాగా నటించేలా స్ఫూర్తినిచ్చింది. ఈ సినిమాలో కేసీఆర్‌గా నా పాత్ర స్కూలింగ్ నుంచి మ్యారేజ్ అయ్యే వరకు ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పాత్రలో నటించడం చాలా గర్వంగాను, ఛాలెంజింగ్‌గానూ ఉంది. ఓ గొప్ప వ్యక్తి పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా. ఇంత మంచి సినిమాలో నటించే అకాశం ఇచ్చిన దర్శకుడు హరీష్‌కి థ్యాంక్స్. మంచి కాన్సెప్ట్‌తో, అందరికీ తెలిసిన గొప్ప వ్యక్తి చరిత్రతో తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల్ని కచ్చితంగా అలరిస్తుంది' అని తెలిపారు.