Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పుష్పక విమానం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న మరో నాయిక గీత్ సైని. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రంలో మీనాక్షి క్యారెక్టర్లో ప్రేక్షకుల ముందుకొస్తోంది. నేడు (శుక్రవారం) ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ గీత్ సైని గురువారం మీడియాతో మాట్లాడుతూ, 'మా ఫ్యామిలీకి సినిమా ఇండిస్టీతో ఎలాంటి రిలేషన్ లేదు. నేను సినిమాల్లోకి వస్తానంటే ఇంట్లో వాళ్లు ఒప్పుకుంటారని అనుకోలేదు.
ఈ సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి, నా స్నేహితురాలు ఒకరు నా ఫొటోలు పంపింది. ఆడిషన్ చేసినప్పుడు మీనాక్షి క్యారెక్టర్‌కు నేను బాగా సరిపోతాని దర్శకుడు దామోదర సెలెక్ట్ చేశారు. చిట్టిలంక సుందర్ వైఫ్ మీనాక్షి. తను పెళ్లయ్యాక ఇంట్లోంచి వెళ్లిపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. మీనాక్షి క్యారెక్టర్లో నటించడం అంత సులువు కాదు. ఎప్పుడూ ఒక మూడ్‌లో ఉండాల్సి వచ్చేది. ఈ సినిమా చూశాక ఆడియెన్స్ నా క్యారెక్టర్‌ను ఇష్టపడతారు. ఆనంద్ చాలా మంచి వ్యక్తి. చిత్రీకరణ టైమ్‌లో చాలా సపోర్ట్ చేశాడు. నా కెరీర్లో ఇంత పెద్ద స్పాన్ ఉన్న సినిమా చేస్తాననుకోలేదు. అలాగే నా పాత్రకి కూడా మంచి గుర్తింపు లభిస్తుందని నమ్ముతున్నా. అందుకే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకూ మరో ప్రాజెక్ట్ చేయకూడదని, వచ్చిన కొన్ని ఆఫర్స్‌ని కూడా వదులుకున్నా. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్. అన్ని రకాల పాత్రలు ముఖ్యంగా సాయిపల్లవిలా డాన్స్ బేస్డ్ క్యారెక్టర్స్ చేయాలని, ఆమెలా పేరు తెచ్చుకోవాలని ఉంది' అని చెప్పారు.