Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అర్జున్ వారాహి, రేఖా నిరోషా జంటగా రూపొందుతున్న చిత్రం 'సౌండ్' (మల్టీ బ్రాండ్) అనేది క్యాప్షన్. కేవీ చౌదరి దర్శకుడు. కె.సాయి చంద్రిక సమర్పణలో శ్రీ సాయి వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై కె.రవీంద్ర ప్రొడక్షన్ నెం1గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు రామానాయుడు స్టూడియోలో సినీ అతిరథుల సమక్షంలో వైభవంగా జరిగాయి. హీరో, హీరోయిన్‌పై చిత్రీకరించిన తొలి షాట్‌కు ముఖ్య అతిథులుగా విచ్చేసిన దర్శకుడు భీమనేని శ్రీనివాస్‌రావు క్లాప్ కొట్టగా, దర్శకుడు వాసు వర్మ కెమెరా స్విచ్చాన్ చేశారు. మేకర్స్‌కి నిర్మాత అచ్చిరెడ్డి స్క్రిప్ట్ అందించారు.
ఈ సందర్భంగా దర్శకుడు కేవీ చౌదరి మాట్లాడుతూ, 'ఫ్యామిలీతో హ్యాపీగా చూసేలా మంచి ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాం. మన జీవితంలో 'సౌండ్' అనేది చాలా కామన్ వర్డ్. అందుకే ఈ క్యాచీ టైటిల్‌ని మా సినిమాకి పెట్టాం. ఈ నెల 15 నుంచి చిత్రీకరణకు వెళ్తున్నాం. హైదరాబాద్, వైజాగ్‌లో చేసే రెండు షెడ్యూల్స్‌తో సినిమాను పూర్తి చేస్తాం' అని చెప్పారు.
'ఈ సినిమాలో వినోదంతోపాటు సెంటిమెంట్ కూడా ఉంటుంది. ఫ్యామిలీస్‌ని మెప్పించే సినిమా అని కచ్చితంగా చెప్పగలను' అని నిర్మాత కె.రవీంద్ర అన్నారు. హీరో అర్జున్ వారాహి మాట్లాడుతూ, 'ఇది పక్కాగా కామెడీ ఎంటర్టైనర్. మాస్ ఎలిమెంట్ కూడా పుష్కలంగా ఉంటాయి. సౌండ్ అనే టైటిల్‌కి తగ్గ సినిమా ఇది' అని తెలిపారు. 'ఈ సినిమా చూసిన వారంతా చాలా బాగా ఎంజారు చేస్తారు. అలాంటి కథ ఇది' అని హీరోయిన్ రేఖా నిరోషా చెప్పారు.