Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్న చిత్రం 'ఆదిపురుష్'. దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ దర్శకుడు ఓంరౌత్ ఓ ఫొటోని పోస్ట్ చేశారు. ''ఆదిపురుష్' చిత్రీకరణ 103 రోజుల్లో ముగిసింది. ఓ అద్భుతమైన ప్రయాణం గమ్యస్థానానికి చేరుకుంది. మేము క్రియేట్ చేసిన మ్యాజిక్‌ని మీతో పంచుకోవడం కోసం ఎంతో ఆతతగా ఎదురుచూస్తున్నా' అని పోస్ట్‌లో పేర్కొన్నారు. '103 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేశారు. అదే స్పీడ్‌లో ప్రభాస్ ఫస్ట్‌లుక్ కూడా రిలీజ్ చేయండి సర్' అంటూ ప్రభాస్ అభిమానులు కామెంట్ల వర్షం కురిపించారు. భారీ 3డీ చిత్రంగా రానున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో సీతగా కతిసనన్ నటిస్తున్నారు.