Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్లో రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'భోళా శంకర్'. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు గురువారం అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగాయి.
మెగాస్టార్‌పై చిత్రీకరించిన తొలి షాట్‌కు కె. రాఘవేంద్రరావు క్లాప్ కొట్టగా, వి.వి.వినాయక్ కెమెరామెన్ స్విచాన్ చేశారు. కొరటాల శివ, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, బాబీ, గోపీచంద్ మలినేని, ఎన్.శంకర్, రైటర్ సత్యానంద్ తదితరులు మేకర్స్‌కి స్క్రిప్ట్ అందజేశారు.
ఈ సందర్భంగా నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ, 'గత ఏడాదిగా ఈ స్క్రిప్ట్ మీద మెహర్ రమేష్ ఎంతో వర్క్ చేశారు. మా హీరోయిన్ తమన్నాను మళ్లీ రిపీట్ చేస్తున్నాం. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా సక్సెస్‌ను కంటిన్యూ చేస్తాం' అని చెప్పారు.
'ఇది నాకు చాలా మంచి రోజు. ఎందుకంటే చాలా కాలం తర్వాత చిరంజీవితో కలిసి జర్ని చేస్తున్నా. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలి' అని నిర్మాత కె.ఎస్.రామారావు అన్నారు. మహతి స్వర సాగర్ మాట్లాడుతూ, 'డ్రీమ్ కమ్స్ ట్రూ అంటారు. కానీ ఇది నాకు అంతకంటే పెద్దది. మెగాస్టార్ సినిమాకి మ్యూజిక్ అందించే ఛాన్స్ ఇచ్చిన మెహర్ రమేష్‌కి థ్యాంక్స్' అని తెలిపారు.
కథానాయిక తమన్నా మాట్లాడుతూ, 'ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు అనిల్ గారికి థ్యాంక్స్. కెరీర్ ప్రారంభంలోనే నేను చిరంజీవిగారితో చేయాల్సింది. కానీ డేట్స్ వల్ల అడ్జస్ట్ కాలేదు. ఇప్పటి వరకు నేను నా బెస్ట్ చూడలేదు. ఇందులో నన్ను మెహర్ గారు అద్బుతంగా చూపిస్తారని అనుకుంటున్నా' అని అన్నారు.
'ఇది మంచి కథ, సిస్టర్ సెంట్రిక్ కథ. రామారావు గారు నన్ను కన్నడలో దర్శకుడిగా పరిచయం చేశారు. బాస్ సినిమాతో మళ్లీ ఇలా కలవడం ఆనందంగా ఉంది. ఆయన చిరంజీవిగారితో ఎన్నెన్నో బ్లాక్బస్టర్లు తీశారు. మెగాస్టార్‌తో సిినిమా చేయాలనేది నా డ్రీమ్. కమర్షియల్‌గా అందరికీ నచ్చేలా ఈ సినిమా చేస్తాను. నాయికగా తమన్నా, సిస్టర్ పాత్రకు కీర్తి సురేష్ అంగీకరించినందుకు థ్యాంక్స్. ఇందులో సాంగ్స్ ప్రత్యేకంగా ఉండబోతోన్నాయి. అందరూ అన్నయ్య మెగాస్టార్‌ను భోళా శంకర్ అని అంటారు. ఆయన పేరులో కూడా ఉంటుంది. ఈ టైటిల్ పెట్టడంతో వైబ్రేషన్స్ మారిపోయాయి. కచ్చితంగా పెద్ద హిట్ కొట్టబొతున్నాం' అని దర్శకుడు మెహర్ రమేష్ చెప్పారు.
రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కిషోర్ గరికిపాటి, డీఓపీ : డడ్లీ, సంగీతం : మహతి స్వర సాగర్, ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్, స్క్రిప్ట్ పర్యవేక్షణ : సత్యానంద్, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, దిలీస్ సుబ్బరాయన్, కెచ్చా, కొరియోగ్రఫర్ : శేఖర్, లిరిక్స్ : రామ జోగయ్య శాస్త్రి, కాస్లర్ శ్యాం, శ్రీమణి, సిరా శ్రీ, నిర్మాత : రామబ్రహ్మం సుంకర, డైరెక్టర్ : మెహర్ రమేష్.