నవతెలంగాణ హైదరాబాద్ : పాకెట్ ఏసెస్ కు చెందిన ప్రీమియం స్టోరీ టెల్లింగ్ ఛానెల్ డైస్ మీడియా ప్రాంతీయ కంటెంట్ విభాగంలో ప్రవేశిస్తున్నట్టు వెల్లడించింది. దీనిలో భాగంగా తమ మొట్టమొదటి తెలుగు సిరీస్ 'అల్లుడుగారు' ను విడుదల చేసింది. ఈ నూతన సిరీస్ డైస్ మీడియా గతంలో రూపొందించగా అపూర్వ విజయం సాధించిన ఫ్యామిలీ డ్రామా, వాట్ ద ఫోక్స్! కు రీమేక్. 'అల్లుడుగారు' సీజన్ 1ను తెలుగు ఓటీటీ ఆహా లో 29 అక్టోబర్ 2021 నుంచి ప్రసారం చేస్తున్నారు. ఈసందర్భంగా పాకెట్ ఏసెస్ కో-ఫౌండర్, సీఈవో అదితి శ్రీవాస్తవ మాట్లాడుతూ... రీజనల్ కంటెంట్ విభాగంలో ప్రవేశిస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నామన్నారు. తమ ప్రాంతీయ కంటెంట్ కార్యకలాపాలు ఆరంభించేందుకు తెలుగు చక్కటి మాధ్యమంగా భావించామన్నారు. త్వరలో డైస్ మీడియా నుంచి మరిన్ని తెలుగు, తమిళ షోలను రూపొందిస్తున్నట్టు శ్రీవాస్తవ తెలిపారు.