Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకంపై విదార్థ్, ధవిక జంటగా నటించిన చిత్రం 'భగత్ సింగ్ నగర్'. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వాలాజా క్రాంతి దర్శకుడు. వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని 'ఈ విశ్వమంతం వ్యాపించిన' పాటను హీరో శ్రీకాంత్, బెనర్జీ చేతులు మీదుగా చిత్ర బృందం విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, 'భగత్ సింగ్ నగర్.. ఈ పేరులో ఉండే పవర్ యాక్షన్ టీజర్‌లోను, ప్రకాష్ రాజ్ గారు రిలీజ్ చేసిన 'చరిత చూపని..' సాంగ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. వాటి రేంజ్‌కి ఏ మాత్రం తగ్గకుండా 'ఈ విశ్వమంతం వ్యాపించిన..' పాట ప్రస్తుత పరిస్థితులకి ప్రతిబింబంగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా' అని చెప్పారు.
'ఈ సినిమాలో నేను నెగటివ్ షేడ్స్ ఉన్న మంచి క్యారెక్టర్ చేశాను. సినిమాకు కథే బలం. ఈ కథను దర్శకుడు క్రాంతి చాలా బాగా ప్రజెంట్ చేశాడు. చాలా మంది కొత్త నటీనటులు, టెక్నిషన్స్ అలాగే సీనియర్ యాక్టర్లు, అవార్డు విన్నింగ్ సాంకేతిక నిపుణులతో ఒక మంచి సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం' అని బెనర్జీ అన్నారు.
రవి ప్రకాష్, మునిచంద్ర, మాస్టర్ పాంచజన్య, అజరు ఘోష్, ప్రభావతి, సంధ్య, జయకుమార్, హరిబాబు, జయచంద్ర, మహేష్, ఒమర్, శంకర్, వెంకటేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : రాజేష్ పీటర్, కళ్యాణ్ సమి, ఎడిటింగ్ : జియాన్ శ్రీకాంత్, నత్యం : ప్రేమ్-గోపి, నేపథ్య సంగీతం: ప్రభాకర్ దమ్ముగారి, కథ-కథనం-దర్శకత్వం : వాలాజా క్రాంతి.