Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ జంటగా, నరేష్, తులసి, 'గెటప్' శీను, ప్రమీల రాణి (భామ) ప్రధాన పాత్రల్లో నటించిన 'జీ 5' ఒరిజినల్ వెబ్ సిరీస్ 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'. పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ పతాకంపై నిహారికా కొణిదెల నిర్మించారు. మహేష్ ఉప్పాల దర్శకుడు. మొత్తం ఐదు ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్ ఈనెల 19న 'జీ 5' ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం రాత్రి గ్రాండ్‌గా నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన కథానాయకుడు వరుణ్ తేజ్ ఈ వెబ్ సిరీస్‌లోని 'అరే మహేషా...' పాటను విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిహారికా కొణిదెల మాట్లాడుతూ, 'నా ప్రొడక్షన్ హౌస్ వరకూ 'జీ 5' ఇల్లు లాంటిది. ఇదొక కామెడీ ఫ్యామిలీ డ్రామా. ఇందులోని ప్రతి క్యారెక్టర్‌కు చాలా ప్రాధాన్యత ఉంది. అందుకని, ఆచితూచి ఎంపిక చేశాం' అని చెప్పారు. 'జీ 5' అనురాధ మాట్లాడుతూ, 'దర్శకుడు మహేష్ ఉప్పాల బాగా తీశారు. నటీనటులు అందరూ చక్కగా నటించారు. నేను ఈ వెబ్ సిరీస్ చూసేటప్పుడు బాగా ఎంజారు చేశాను. ప్రేక్షకులు కూడా ఎంజారు చేస్తారని ఆశిస్తున్నాను' అని తెలిపారు. 'నేను 'గోల్కొండ హైస్కూల్'లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసినప్పటి నుంచి నిమ్మకాయల ప్రసాద్ గారు పరిచయం. నా పేరును నిహారికగారికి ఆయనే సూచించారు. ఆయనకు నేను చాలా రుణపడి ఉంటాను. నిహారిక గారు ఈ కథను ఎంతగానో నమ్మారు. సినిమాకు ఏమాత్రం తక్కువ కాకుండా నిర్మించారు. నేను బాగా నటించానని అనిపిస్తే, డైరెక్టర్ మహేష్, రైటర్ మానస కారణం' అని చెప్పారు.
'ఈ వెబ్ సిరీస్ చేసే క్రమంలో టీమ్ అందరం ఒక చిన్న ఫ్యామిలీ అయిపోయాం' అని నాయిక సిమ్రాన్ శర్మ అన్నారు. డైరెక్టర్ మహేష్ ఉప్పాల మాట్లాడుతూ, 'ఏ మాత్రం సినిమాలకు సంబంధం లేని నేను ఇక్కడి వరకు వచ్చానంటే కారణం నిహారిక గారు. నేనే కాదు, నాలాగా చాలామంది కొత్తవాళ్ళను, టెక్నీషియన్స్‌ను ఆమె ఎంకరేజ్ చేశారు' అని అన్నారు. రైటర్ మానసా శర్మ మాట్లాడుతూ, 'నిహారిక వల్లే నేను దీనికి మాటలు రాయగలిగాను. నా మాటలు అందరికీ నచ్చుతాయని ఆశిస్తున్నా' అని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరశంకర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ ఎడ్రోల్, మ్యూజిక్ డైరెక్టర్ పీకే, 'గెటప్' శీను, నరేష్, సీనియర్ నటి ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
ఈ వెబ్‌సిరీస్ ట్రైలర్ చూసి షాకయ్యా. ట్రైలర్ చాలా బాగుంది. సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్ టైమింగ్, యాక్టింగ్ అద్భుతంగా ఉన్నాయి. సినిమాకి ఏ మాత్రం తీసిపోని క్వాలిటీతో ఉన్న ఈ వెబ్ సిరీస్‌ను ఇంట్లో అందరూ కూర్చుని ఎంజారు చేస్తారని ఆశిస్తున్నా.
- వరుణ్ తేజ్