Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోటి తనయుడు రాజీవ్ సాలూరి హీరోగా, వాణి విశ్వనాథ్ తనయ వర్ష విశ్వనాథ్ హీరోయిన్గా కిట్టు నల్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం '11:11'. టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై గాజుల వీరేష్ (బళ్లారి) ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో వైభవంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో ముఖ్య అతిధిగా విచ్చేసిన చిరంజీవి టైగర్ హిల్స్ ప్రొడక్షన్ బ్యానర్‌తోపాటు చిత్ర టైటిల్ ఫస్ట్‌లుక్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'నా విజయంలో, నా ఎదుగుదలలో రాజ్ - కోటిలదే సింహభాగం. కోటి గారి కొడుకు రాజీవ్‌ను ఆశీర్వదించడానికి వచ్చి, కోటి గారి ఋణాన్ని ఇలా తీర్చుకోవడానికి ఈ వేడుక నాకు వేదిక అవ్వడం సంతోషంగా ఉంది. సినిమా పరిశ్రమ అద్భుతమైన పరిశ్రమ. కొత్త వాళ్లు ఇండిస్టీకి వస్తానంటే నేను గ్రాండ్‌గా వెల్కమ్ చెబుతాను. వచ్చిన వాళ్ళంతా కష్టాన్ని నమ్ముకుని పని చేస్తూ, నిజాయితీగా ఉండాలి. అలా ఉంటే ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి. సినీ ఇండిస్టీకి కొత్త తరం రావాలి. ఈ సినిమా రాజీవ్‌కు మంచి బ్రేక్ ఇవ్వాలి. అలాగే రాజ్ గారి అబ్బాయి సాగర్‌కు కూడా ఈ సినిమాలో అవకాశం కల్పించడం సంతోషం. సాగర్ కూడా తండ్రిని మించిన తనయుడు కావాలని కోరుకుంటున్నాను. చిత్ర నిర్మాత కూడా లాభాపేక్ష లేకుండా ప్యాషన్‌తో ఇండిస్టీకు రావడం చాలా గ్రేట్ నెస్. ఈ సినిమా ద్వారా వీరికి గొప్ప సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అని చెప్పారు. 'మా రాజీవ్ కూడా మంచి నటుడుగా రాణించాలని మనస్పూర్తిగా కోరుతున్నాను. అలాగే మణిశర్మ గొప్ప సంగీత దర్శకుడు తను ఎన్నో అద్భుతమైన పాటలు ఇచ్చాడు.నేను తనతో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. మంచి కాన్సెప్ట్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి' అని కోటి అన్నారు. చిత్ర నిర్మాత వీరేశ్ (బళ్లారి )మాట్లాడుతూ,'మా సంస్థ నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా మంచి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొసాత్రం' అని చెప్పారు.
'ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాకు మెగాస్టార్ సపోర్ట్ లభించడం మా అదష్టం. సంగీత దిగ్గజం మణిశర్మ అందిస్తున్న సంగీతం మేజర్ అసెట్ కానుంది. రాజీవ్ సాలూర్ నటన హైలైట్ అవుతుంది' అని దర్శకుడు కిట్టు నల్లూరి తెలిపారు. హీరో రాజీవ్ సాలూరు మాట్లాడుతూ,' చిరంజీవిగారు నాకు ఇన్స్పిరేషన్. ఆయన మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు కృతజ్ఞతలు' అని అన్నారు. 'ఇంత పెద్ద సీనియర్ నటులతో నేను సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని కథానాయిక వర్షా విశ్వనాథ్ చెప్పారు.