Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రేక్షకులు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తూ బిగ్‌బాస్ 5 హౌస్ నుంచి నటుడు విశ్వ వీడ్కోలు తీసుకున్నారు. ఈ సీజన్‌కే సూపర్ హీరో అనిపించుకుని మరీ షో నుంచి ఆయన ఎలిమినేట్ అవ్వడం విశేషం. బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సందర్భంగా బిస్‌బాస్ హౌస్‌తో తనకి ఏర్పడిన అనుబంధం గురించి విశ్వ శనివారం మీడియాతో షేర్ చేసుకున్నారు.
'తెలుగు నాట 2002లో నా ప్రయాణం మొదలైంది. నటుడిగా పలు ప్రయత్నాల తర్వాత 2004లో నా మొదటి సినిమా 'పెళ్ళికోసం' విడుదలై, మంచి ఆదరణ పొందింది. అదే ఏడాదిలో 'విద్యార్థి' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా మంచి పేరు తీసుకురావడంతోపాటు నటుడిగా లాంగ్జర్నీకి మంచి ఫ్లాట్‌ఫామ్‌ని సెట్ చేసింది. బిగ్ బాస్ హౌస్‌లోకి రాకముందు ఓ తెలుగు సినిమా ఒప్పుకున్నాను. ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా ఈ షోలో పాల్గొనేందుకు ప్రిపేరై, హౌస్‌లోకి అడుగు పెట్టా. అయితే హౌస్‌లో నుండి బయటికి రావడం షాకింగ్‌గా ఉంది. హౌస్‌లో ఉంటే ఇంకా బాగా ఆడే వాడినేమో (నవ్వుతూ). అవకాశం వస్తే మళ్లీ నేను హౌస్‌లోకి వెళ్ళడానికి రెడీ. హౌస్‌లో ఉన్నప్పుడు నా భార్యను, కొడుకును మిస్ అయిన ఫీలింగ్ కలిగింది. ఈ హౌస్‌లోకి ఎంటర్ అవ్వడం వల్ల నాకు లోబో అనే ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు. అలాగే నాకు సిస్టర్స్ లేరు. ఈ షోలో సరయు బెస్ట్ సిస్టర్ అయ్యింది. శ్రీరామ్, రవి, సన్నీ, షణ్ముక్, సిరి.. వీళ్లు నా దృష్టిలో టాప్ 5 కంటెస్టెంట్స్. శ్రీరామ్ బిగ్ బాస్ 5 టైటిల్ విన్నర్ అవుతాడనే నమ్మకం ఉంది. ప్రస్తుతం కథలు వింటున్నాను. హీరోగా అవకాశం వస్తే చెయ్యడానికి రెడీగా ఉన్నా' అని తెలిపారు.