Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం 'అమ్మాయి'. ఈ చిత్రాన్ని ఆర్ట్ సి మీడియా, పారిజాత మూవీ క్రియేషన్స్, చైనా కంపెనీ బిగ్ పీపుల్ సంయుక్తంగా నిర్మించాయి. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను వర్మ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విడుదల చేశారు. ఈ చిత్రంలో మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ పూజ భలేకర్ టైటిల్ రోల్ పోషించారు. ఆమె ఫైటింగ్ స్కిల్స్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయని, ఈ చిత్రాన్ని వర్మ బ్రూస్లీకి అంకితం ఇస్తున్నారని, భారత దేశంలోనే మొదటి వాస్తవికమైన మార్షల్ ఆర్ట్స్ చిత్రమిదని మేకర్స్ తెలిపారు.
డిసెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ, 'వర్మ కెరీర్లోనే అత్యంత ఖరీదైన, ప్రతిష్టాత్మకమైన సినిమా ఇది. ఈ చిత్రాన్ని హిందీ, చైనీస్ భాషలతోపాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ ఏకకాలంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశాం. ఈ చిత్ర చైనీస్ వెర్షన్‌ని చైనాలోని భారీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ చైనా ఫిలిం గ్రూప్ కార్పొరేషన్ 'డ్రాగన్ గర్ల్ 'పేరుతో భారీ ప్రమోషన్‌తో 20 వేల థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈనెల 27న బ్రూస్ లీ 81వ జయంతి సందర్భంగా ఫోషన్ కుంగ్ ఫు ఫిలిం ఫెస్టివల్ ప్రారంభ చిత్రంగా ఈ సినిమా ప్రదర్శితం కానుంది. అలాగే దుబారులోని ప్రపంచంలోనే ఎతైన బుర్జ్ ఖలీఫా భవనం మీద ఈ చిత్ర తొలి ప్రోమోని చూపించబోతున్నాం' అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం : రవి శంకర్, డిఎస్అర్, కెమెరా: మల్హర్ భట్ జోషి, ఎడిటర్ : కమల్ రామడుగు, ప్రభు దేవా, ఆర్ట్ డైరెక్టర్ : మధుకర్ దేవర, దర్శకుడు : రామ్ గోపాల్ వర్మ.