Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకష్ణ కథానాయకుడిగా ఓ నూతన చిత్రం ప్రారంభమైంది. దీనికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలకష్ణ సరసన శృతిహాసన్ నాయికగా నటిస్తోంది. నవీన్ యెర్నేని, వై రవి శంకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఎన్బికె 107 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతన్న ఈ చిత్ర ప్రారంభోత్సవం శనివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా జరిగింది.
బాలకృష్ణ, శృతిహాసన్పై చిత్రీకరించిన ముమూర్తపు సన్నివేశానికి అగ్ర దర్శకులు వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా, బోయపాటి శ్రీను కెమెరా స్విచాన్ చేశారు. తొలి సన్నివేశానికి మరో దర్శకుడు హరీష్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. కొరటాల శివ, బాబీ, బుచ్చిబాబు సానా వంటి దర్శకుడు ఈ చిత్ర స్క్రిప్ట్‌ను మేకర్లకు అందజేశారు.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ, 'మాస్ హీరో, మాస్ డైరెక్టర్ కలిసి పనిచేస్తే మాస్ ఆడియన్స్‌కు విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. బాలకష్ణ కోసం దర్శకుడు గోపీచంద్ మలినేని అద్భుతమైన కథను సిద్దం చేశారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఆయన ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించబోతున్నారు. అలాగే నటీనటుల పరంగా, సాంకేతికంగా ఈ చిత్రం అత్యున్నతంగా ఉండబోతోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా, రిషి పంజాబీ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ సినిమాకు ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బాలకష్ణకు తగ్గట్టుగా పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లను రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేయనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి ప్రారంభం కానుంది' అని తెలిపారు.