Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆనంద్ దేవరకొండ నటించిన తాజా చిత్రం 'పుష్పక విమానం'. ఈ సినిమా శుక్రవారం విడుదలై ప్రేక్షకుల విశేష ఆదరణతో హిట్ దిశగా పయనిస్తోంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం శనివారం రామానాయుడు స్టూడియోలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ, 'ఈ సినిమాపై మాకున్న అంచనాలు నిజమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ నుంచి కూడా హిట్ టాక్ వస్తోంది. అన్నయ్య విజయ్ యూఎస్‌లో ఉన్నారు. థియేటర్లలో వస్తున్న రెస్పాన్స్ వీడియోలను ఆయనకు పంపించాం. నిర్మాతగా ఆయన చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. నా నటనతో పాటు హీరోయిన్ల నటన కూడా బాగుందని అందరూ చెబుతున్నారు. కథ విన్నప్పుడు కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఆడియెన్స్ ఇష్టపడేలా ఈ సినిమా ఉంటుందని అనిపించింది. నాలాగే ప్రేక్షకులూ ఫీలయ్యారు. అందుకే టెర్రిఫిక్ రెస్పాన్స్ వస్తోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాని బాగా ఎంజారు చేస్తున్నారు' అని తెలిపారు. 'ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్‌కు సంతోషంగా ఉంది. ఫస్ట్ టైమ్ దర్శకుడిని కాబట్టి నా సినిమాను తెరపై చూస్తూ, నేను రాసిన కథకు, సీన్స్‌కి, మాటలకు వస్తున్న స్పందన చూస్తుంటే సంతప్తిగా ఉంది. ఆనంద్, నిర్మాత విజరు నేను చెప్పింది నమ్మి, నేను సినిమా కోసం అడిగింది ఇచ్చి, చేశారు. ఈ సక్సెస్ వారిదే' అని దర్శకుడు దామోదర అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని మాట్లాడుతూ,'అటు ప్రేక్షకులతో పాటు ఇండిస్టీలోని సెలబ్రిటీలకి కూడా ఈ సినిమా బాగా నచ్చింది. స్పెషల్ షోలను సెలబ్రిటీలకు వాళ్ల ఇంటి దగ్గరే ఏర్పాటు చేశాం. వాళ్లంతా బాగుందని కాల్స్ చేస్తున్నారు. థియేటర్లలో మంచి రెస్పాన్స్ ఉంది. ఈ సినిమాని బిగ్ హిట్ చేసిన అందరికీ కృతజ్ఞతలు' అని తెలిపారు.
'ఓ మంచి చిత్రంలో నటించే అవకాశం రావడంతోపాటు ఈ సినిమాలో మేం బాగా నటించామంటూ అందరూ కితాబివ్వడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. మా సినిమాని ప్రేక్షకులు బాగా ఎంజారు చేస్తున్నారు' అని నాయికలు గీత్ సైని, శాన్వి మేఘన చెప్పారు.