Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు సినిమా రంగానికి అవార్డులను అందిస్తూ ప్రముఖులతో కితాబులందుకుంటున్న సినీ వార పత్రిక 'సంతోషం'. నేడు (ఆదివారం) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించబోయే 'సంతోషం సౌతిండియా సినిమా అవార్డ్స్' కార్యక్రమం ఈసారి ఎన్‌స్క్వేర్ సమర్పణలో సుమన్ టీవీ భాగస్వామంతో జరుగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం గ్రాండ్‌గా జరిగిన కర్టైన్ రైజర్ వేడుకలో నటుడు ఆలీ 'సంతోషం - సుమన్ టీవీ సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్' బ్రోచర్‌ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సురేష్ కొండేటి మాట్లాడుతూ, 'ఈ అవార్డు వేడుకలు జరపడానికి కారణం తెలుగు ఇండిస్టీలో ఉన్న హీరోలు, నిర్మాతలు, దర్శకులే. నేను కష్ణగారి అభిమానిని, ఆ తర్వాత చిరంజీవి గారి ప్రోత్సాహంతో ఈ రంగంలో ఎదిగాను. కరోనా ఎఫెక్ట్‌తో గత రెండు సంవత్సరాలుగా ఈ వేడుకలను జరపలేదు. అందుకే మరో ఇరవై ఏండ్లు గుర్తుండిపోయేలా ఈసారి అవార్డు వేడుకలను నిర్వహిస్తున్నాం. ఈ వేడుకకి ఎన్ స్క్వేర్ ఎండి నవీన్ రెడ్డికి అండగా నిలబడినందుకు థ్యాంక్స్. ఎస్పీ బాలు గారి మరణం తీరని లోటు. అయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన గౌరవార్ధం వందమంది సింగర్స్, వంద పాటలతో గ్రాండ్‌గా ట్రిబ్యూట్ ఇస్తున్నాం. నేడు (ఆదివారం) హెచ్ఐసీసీలోని నోవాటెల్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ వేడుకను నాన్‌స్టాప్‌గా నిర్వహిస్తున్నాం. ఈ అవార్డుల ఫంక్షన్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి' అని తెలిపారు.