Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇవాన్ రీట్మాన్ దర్శకత్వంలో 'ఘోస్ట్‌బస్టర్'కు సీక్వెల్‌గా 'ఘోస్ట్‌బస్టర్ ఆఫ్టర్ లైఫ్' పేరుతో మరో చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి ఇవాన్ రీట్మాన్ తనయుడు జాసన్ రీట్మాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు జాసన్ రీట్మాన్ మాట్లాడుతూ, 'ఈ ఫ్రాంచైజీలో తొలి చిత్రం సినిమా 1984లో వచ్చింది. ఆ తర్వాత 1989, 2016లో మరో రెండు చిత్రాలు వచ్చాయి. ఇవి మంచి ప్రేక్షకాదారణ పొందాయి. ఇక తాజా 'ఘోస్ట్‌బస్టర్ : ఆఫ్టర్ లైఫ్' సినిమాకి 30 ఏండ్ల క్రితమే స్క్రీన్ ప్లేను సమకూర్చుకుంటే, అది ఇప్పటికి కార్యరూపం దాల్చింది. మా నాన్న అడుగుజాడల్లోనే నేను ఈ చిత్రాన్ని పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కించాను. ఓ బ్లాక్‌బస్టర్ చిత్రానికి సీక్వెల్ తీయడం అంటే ఎంతో సవాల్‌తో కూడుకున్న పని. అయినప్పటికీ ప్రేక్షకులను మంత్రమగ్ధులను చేసేలా ఈ చిత్రాన్ని వెండితెరపై ఆవిష్కరించాం' అని తెలిపారు. పాల్ రుడ్, బిల్ ముర్రే, నాగన్ కిమ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ : జాసన్ రీట్మాన్, గిన్ కెనన్, కెమెరా : ఎరిక్ స్పీల్బర్గ్, సంగీతం : రామ్ సైమన్సన్.