Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా 'మిస్సింగ్'. ఈ చిత్రాన్ని బజరంగబలి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మించారు. ఈ చిత్రంతో శ్రీని జోస్యుల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 19న థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో హీరో హర్షా నర్రా మాట్లాడుతూ, ' మా సినిమాని థియేటర్ అనుభూతి కోసమే తెరకెక్కించాం. అందుకే ఓటీటీ ఆఫర్స్ ఎన్ని వచ్చినా థియేటర్ రిలీజ్‌కే ఆసక్తి చూపాం. అంతా కొత్తవాళ్లం చేసిన ప్రయత్నమిది. మంచి థ్రిల్లర్ మూవీ చేశాం. ఫ్యామిలీ అంతా చూసేలా సినిమా ఉంటుంది' అని తెలిపారు. దర్శకుడు శ్రీని జోస్యుల మాట్లాడుతూ, 'ఈ సినిమాలో ఎక్కడా వల్గారిటీ ఉండదు. మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే చిత్రమిది. మీకు నచ్చితే పది మందికి చెప్పండి' అని చెప్పారు. 'ఈ మూవీలో మిస్ అయ్యేది నేనే. ఈ నెల 19న ప్రేక్షకులు అందరూ నన్నే వెతుకుతారని అనుకుంటున్నాను. ఇందులో ఎన్నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు నా క్యారెక్టర్ కూడా అందర్నీ మెస్మరైజ్ చేస్తుంది' అని హీరోయిన్ నికీషా రంగ్వాలా అన్నారు.