Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్, చాందిని తమిళ్‌రాసన్, శాని సాల్మాన్, షెర్రీ అగర్వాల్ నటీనటులుగా రూపొందిన చిత్రం 'రామ్ అసుర్'. ఎఎస్పి మీడియా హౌస్, జివి ఐడియాస్ పతాకాలపై వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. అభినవ్ సర్ధార్, వెంకటేష్ త్రిపర్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 19న ఎంతో గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ కాబోతుంది.
ఈ నేపథ్యంలో సినీ అతిరథుల సమక్షంలో ట్రైడెంట్ హౌటల్లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. దర్శకుడు మారుతి ప్రీ రీలీజ్ ట్రైలర్‌ను విడుదల చేయగా, దర్శకుడు బుచ్చిబాబు 'ఎం చేశావే మాయ మాయ' సాంగ్‌ను లాంచ్ చేశారు. అలాగే ఈ చిత్ర బిగ్ టికెట్‌ను దర్శకులు మారుతి, నిర్మాత బెల్లంకొండ సురేష్ రిలీజ్ చేసి, ఫస్ట్ టికెట్స్‌ను కొనుగోలు చేశారు.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాత వెంకటేష్ త్రిపర్ణ మాట్లాడుతూ,'మెగాస్టార్ చిరంజీవిగారి స్ఫూరితోనే ఈ నేను స్థాయికి రాగలిగాను. అలాగే దర్శకుడు మారుతి గారి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను రాసుకున్న కంటెంట్‌ను అనుకున్నది అనుకున్నట్లు స్క్రీన్‌పై చూపించాను. కెమెరామెన్ ప్రభాకర్ రెడ్డి, ఎడిటర్ బసవ రెడ్డి, సంగీత దర్శకుడు భీమ్స్.. ఈ ముగ్గురు నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. .ట్రైలర్ చూస్తే యాక్షన్ ఫిల్మ్‌గా అనిపిస్తుంది. కానీ ఇందులో లవ్‌స్టోరీ కూడా ఉంటుంది. ప్రతి 15 నిమిషాలకు ఒక ట్విస్ట్ ఉంటుంది. అవి ఏంటన్నది సినిమా చూస్తే తెలుస్తుంది. అభినవ్ సర్దార్ చాలా అద్భుతంగా నటించాడు. ఈ చిత్రంలోని విజువల్స్ ప్రత్యేకంగా ఉంటాయి' అని తెలిపారు. 'అన్ని సినిమాల్లాగా ఈ సినిమా ఉండదు. ఇందులో ఉన్న పాయింట్‌ను ఇప్పటివరకు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్లో ఎవరు టచ్ చేయలేదు. కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడుకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమా అందరికీ రీచ్ అవ్వాలని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం' అని చిత్ర హీరో, నిర్మాత అభినవ్ సర్ధార్ చెప్పారు.
సహ నిర్మాత రామకష్ణ మాట్లాడుతూ, 'కొత్త కథతో క్వాలిటీలో ఎక్కడా రాజీపడకుండా సినిమా తీశాం. స్నేహితులు, శ్రేయోభిలాషులు ఇచ్చిన సలహాతో ఓటీటీలో కాకుండా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. కార్తీక పౌర్ణమి వంటి మంచి రోజున మా సినిమాను విడుదల చేస్తున్నాం' అని తెలిపారు.