Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యజుర్వేద్, రచన, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'చిత్తం మహారాణి'. లిటిల్ థాట్స్ సినిమాస్ సమర్పణలో ఎ. కాశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
జెఎస్ మణికంఠ, ప్రసాద్ రెడ్డి టిఆర్ నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను అగ్ర దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. ఫస్ట్‌లుక్ చూస్తుంటే ఓ మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉంటుందనిపిస్తోంది. చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ అని దర్శకుడు సుకుమార్ చెప్పారు. ఈ చిత్రానికి 'చిత్తం మహారాణి' అనే టైటిల్‌ని ఎందుకు పెట్టాల్సి వచ్చిందనే విషయాన్ని మాటల్లో కంటే వెండితెరపై చూస్తేనే థ్రిల్లింగ్‌గా ఉంటుందని, ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలోనే తెలియజేయస్తామన్నారు. తులసి, హర్షవర్ధన్, మధునందన్, సత్య, రాజ్ కుమార్ కాశిరెడ్డి, వైవా హర్ష, జబర్దస్త్ అశోక్, నాయని పావని తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి మాటలు : సురేష్ సిద్హాని, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, సంగీతం : గౌర హరి, కెమెరా : విశ్వనాథ్ రెడ్డి, యాక్షన్ కొరియోగ్రాఫర్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రాఫర్ : విజరు బిన్నీ, దర్శకుడు: ఎ. కాశీ