Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తేజ సజ్జా, శివానీ రాజశేఖర్ జంటగా రూపొందిన చిత్రం 'అద్భుతం'. మల్లిక్ రామ్ దర్శకుడు. ప్రశాంత్ వర్మ కథ అందించిన ఈ చిత్రాన్ని చంద్ర శేఖర్ మొగుళ్ళ నిర్మించారు. మహా తేజ క్రియేషన్స్, ఎస్. ఒరిజిల్స్ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి సృజన్ ఎరబోలు సహనిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 19 నుంచి డైరెక్ట్‌గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు మల్లిక్‌రామ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ''ఆహా' కోసం చేసిన 'తరగతి గది దాటి' వెబ్‌సిరీస్ మంచి గుర్తింపు తీసుకొచ్చింది. నా స్నేహితుడు, దర్శకుడు ప్రశాంత్ వర్మ రాసిన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. నాయకానాయికలు ఇద్దరికీ ఒకే ఫోన్ నెంబర్ ఉంటుంది. ఇలా ఉండటానికి కారణం ఏంటి?, దీనికి వెనుక ఏం జరిగిందనే ప్రశ్నలకు సమాధానం క్లయిమాక్స్‌లో దొరుకుతుంది. ఇందులో ఫాంటసీ ఎలిమెంట్ కూడా ఉంది. అయితే ఇది భక్తి నేపథ్యంలో కాకుండా సై-ఫైని మించి ఉంటుంది. సినిమా ఫస్టాప్ కామెడీ, రొమాన్స్‌తో ఉంటే, సెకండాఫ్ మాత్రం మనసుల్ని కదిలించే ఎమోషన్స్ ఉంటాయి. ముఖ్యంగా చివరి 15 నిమిషాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. కామెడీతోపాటు ఎమోషన్స్ బాగా రావడానికి రచయిత లక్ష్మీభూపాల్ బాగా శ్రమించారు. ఆయన రాసిన మాటలు, స్క్రీన్‌ప్లే కచ్చితంగా అందర్నీ అలరిస్తాయి. ఈ కథ అనుకున్నప్పుడు హీరోగా తేజ సజ్జాని ఎంపిక చేశాం. అయితే లాక్డౌన్ కారణంగా మా సినిమా విడుదల వాయిదా పడింది. ఈ టైమ్‌లో ఆయన ప్రశాంత్ వర్మతో 'జాంబిరెడ్డి' సినిమా చేసి, ప్రేక్షకుల ముందుకొచ్చారు. అలాగే హీరోయిన్గా ఎవర్ని తీసుకోవాలని ఆలోచిస్తున్నప్పుడు చాలా మంది పేర్లు అనుకున్నాం. అయితే మా నిర్మాతకి ఎన్నో ఏండ్ల నుంచి రాజశేఖర్గారికితో పరిచయం ఉంది. ఆ పరిచయంతో ఆయన కూతురు శివానీ రాజశేఖర్‌కి కథ చెప్తే, ఆమె చాలా ఎగ్జైటై నటించటానికి గ్రీన్‌సిగల్ ఇచ్చారు. తన పాత్రకు ఆమె నూటికి నూరుశాతం న్యాయం చేసింది. ఈనెల 19 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్న మా సినిమాని ఆదరిస్తారని ఆశిస్తున్నాను' అని తెలిపారు.