Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) 8000 మంది సినీ కార్మికులతో, 800 మంది ప్రొడ్యూసర్స్‌తో, 400 'టీ మా' ఆర్టిస్టులతో గత 7 సంవత్సరాలుగా అభివద్ధి చెందుతూ వస్తోంది. రెండేళ్లకోసారి జరిగే టీఎఫ్‌సీసీ ఎలక్షన్స్ కరోనా కారణంగా కొంత ఆలస్యమైంది. అయితే తొలుత ఎన్నికలు జరపాలని నిర్ణయించినప్పటికీ కమిటీ సభ్యులందరి ఏకాభిప్రాయంతో కమిటీ సభ్యుల ఎంపిక ఏకగ్రీవంగా జరిగింది.
ఈ సందర్భంగా సోమవారం ఎఫ్ఎన్సీసీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ సభ్యుల పేర్లను ఎన్నికల అధికారి, న్యాయవాది కె.వి.ఎల్. నరసింహారావు ప్రకటించారు. దీంతో గత సభ్యులే మళ్ళీ బాధ్యతల్ని నిర్వర్తించబోతున్నారు. ఈ సందర్భంగా టీఎఫ్‌సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకష్ణ గౌడ్ మాట్లాడుతూ, 'పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో త్వరలోనే చాలా గ్రాండ్‌గా ప్రమాణ స్వీకారోత్సవాన్ని జరుపుతాం. ఇకపై కూడా టీఎఫ్‌సీసీ ద్వారా మెంబర్స్‌కు మంచి పనులు చేస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో ఇళ్ల స్థలాల కోసం చర్చిస్తే, ఆయన త్వరలోనే 10 ఎకరాల ల్యాండ్‌ని కేటాయిస్తామని మాట ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మెంబర్స్ అందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాం' అని అన్నారు.