Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంపూర్ణేష్ బాబు, అద్వితి శెట్టి హీరో, హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'మిస్టర్ బెగ్గర్'. వడ్ల జనార్థన్ దర్శకుడు. కార్తిక్ మూవీ మేకర్స్ పతాకంపై శ్రీమతి వడ్ల నాగ శారద సమర్పణలో గురురాజ్, కార్తిక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్ర ప్రారంభోత్సవం సోమవారం రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు సత్య ప్రకాష్ క్లాప్ కొట్టగా, కార్తీ మూవీ మేకర్స్ అధినేత, నిర్మాత రాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు వి.సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో హీరో సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ,'దర్శకుడు జనార్థన్ అద్భుతమైన స్క్రిప్ట్‌తో ఈ సినిమా చేస్తున్నారు' అని చెప్పారు. 'సరదాగా సాగే కుటుంబ కథా చిత్రానికి మంచి వినోదాన్ని జోడిస్తున్నాం. సంపూ గారి మేనరిజానికి తగ్గట్టుగా స్క్రిప్ట్ రెడీ చేశాం. బాంబే, చెన్నై, గోవాల్లో చిత్రీకరణ చేస్తాం' అని దర్శకుడు అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ, 'ఈ చిత్రాన్ని ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దుతున్నాం' అని తెలిపారు.