Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని, అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న సమంత ఓ స్పెషల్ సాంగ్‌లో మెరవబోతున్నారు. స్పెషల్ సాంగ్‌లో నటించటం ఆమె కెరీర్లోనే తొలిసారి కావడం విశేషం. అది కూడా 'పుష్ప' చిత్రం కోసం కావడంతో ఆమె ఫ్యాన్స్, ఆడియెన్స్, పరిశ్రమ వర్గాలూ సైతం సర్ప్రైజ్గా ఫీలవుతున్నాయి. ఈ సర్ప్రైజ్ని సాధ్యమయ్యేలా చేయటంలో దర్శకుడు సుకుమార్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అగ్ర కథానాయికగా నెంబర్ వన్ స్థానంలో ఉన్న సమంతని స్పెషల్ సాంగ్‌లో నటించేలా చేయటం అంత సులభమైన విషయం కాదు.
అయితే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' చిత్రంలో, అలాగే అల్లు అర్జున్‌తో కలిసి 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రంలోనూ సమంత నటించింది. దర్శకుడు సుకుమార్, అల్లుఅర్జున్‌పై ఉన్న నమ్మకంతో సమంత ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో నటించేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. 'పుష్ప' చిత్రంలో సమంత ఓ ప్రత్యేక పాటలో మెస్మరైజ్ చేయనుందనే విషయాన్ని మేకర్స్ సోమవారం అధికారికంగా ప్రకటించారు.
అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప : ది రైజ్'. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియాతో సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. ఈనెల 19న 'ఏరు బిడ్డా ఇది నా అడ్డా' అంటూ సాగే నాలుగో సింగిల్ రిలీజ్ కానున్న నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఇందులో అల్లు అర్జున్‌తో సమంత స్టెప్పులు వేయనున్నారని, సమంత ఎంట్రీతో ఈ సినిమాలోని 5వ పాట మరింత స్పెషల్ అయిపోయిందంటూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ని సైతం రిలీజ్ చేసింది.