Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరుణ్‌తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'గని'. అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నాయిక సయీ మంజ్రేకర్ కథానాయిక. కిరణ్ కొర్రపాటి దర్శకుడు. సోమవారం ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. స్టార్ హీరో రామ్‌చరణ్ వాయిస్ ఓవర్‌తో ఆరంభమైన టీజర్ ఆద్యంతం అందర్నీ అలరిస్తోంది. ప్రతి ఒక్కడి కథలో కష్టాలు కన్నీళ్లు ఉంటాయి. కోరికలుంటాయి.. కోపాలుంటాయి. కనపడితే గొడవలుంటాయి. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కడికీ ఛాంపియన్ అయిపోవాలన్న ఆశ ఉంటుంది. కానీ విజేతగా నిలిచేది ఒక్కడే. ఆ ఒక్కడు నువ్వే ఎందుకవ్వాలి.. వై యు?, ఆట ఆడినా, ఓడినా రికార్డ్స్‌లో ఉంటావు. కానీ గెలిస్తే మాత్రమే చరిత్రలో ఉంటావు అంటూ వరుణ్ తేజ్ యాక్షన్ లుక్‌కి రామ్ చరణ్ చెప్పిన డైలాగ్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.
ఈ సందర్భంగా నిర్మాత సిద్ధు ముద్ద మాట్లాడుతూ, 'తెలుగు ఆడియెన్స్‌కు ఓ సరికొత్త అనుభూతిని ఇచ్చేలా సినిమాను భారీ రేంజ్లో నిర్మించాం. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న మా చిత్రాన్ని భారీ రేంజ్లో రిలీజ్ చేస్తున్నాం' అని చెప్పారు.