Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: యష్ రాజ్ ఫిలింస్ పృథ్వీరాజ్‌తో మొదటి చారిత్రాత్మక చిత్రాన్ని రూపొందిస్తుండగా, ఇది నిర్భమైనయ, శక్తివంతమైన సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం, పరాక్రమం ఆధారంగా తెరకెక్కించారు. సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కనికరం లేని ఆక్రమణదారు మహమ్మద్ ఘోరీపై ధైర్యంగా పోరాడిన లెజెండరీ యోధుని పాత్రలో నటిస్తున్నారు. ప్రేక్షకులు ఏకగ్రీవంగా ఆదరిస్తున్న ఈ సినిమా టీజర్‌ను అక్షయ్ నిన్న సోషల్ మీడియా ద్వారా ఆవిష్కరించారు. టీజర్లో మాజీ ప్రపంచ సుందరి-2017, మానుషి చిల్లర్‌ను ప్రిన్సెస్ సంయోగితగా పరిచయం చేసింది. బాలీవుడ్లో ప్రతి ఒక్కరూ ఆమెలోని ప్రతిభను గుర్తిస్తారని అక్షయ్ పేర్కొన్నారు.
అక్షయ్ మాట్లాడుతూ 'నిమానుషి నిస్సందేహంగా చూడవలసిన ప్రతిభ. పృథ్వీరాజ్ ఆమెకు మొదటి చిత్రం అయినప్పటికీ, ఆమె శ్రమరహితంగా, చాలా పరిశోధనాత్మకంగా, అంకితభావంతో మొత్తం జట్టు హృదయాన్ని గెల్చుకుంది. మా దర్శకుడు డా.చంద్రప్రకాష్ ద్వివేది పరిపూర్ణ సంయోగితను గుర్తించారు ఎందుకంటే, మానుషి తన దయ మరియు తన తల్లిదండ్రులు కల్పించిన జీవిత విలువల ద్వారా, లోపల అందంగా ఉండే భారతీయ మహిళల స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది' అని పేర్కొన్నారు.
'నిమన హిందీ చిత్ర పరిశ్రమలో మానుషి ఎలా ఒక ముద్ర వేస్తుందో చూసేందుకు నేను చాలా ఉత్సుకతతో ఉన్నాను. ప్రేక్షకులు అందరూ ఆమెను ముక్తకంఠంతో స్వాగతిస్తారని నేను ఆశిస్తున్నాను. ఆమెను ప్రిన్సెస్ సంయోగితగా పరిచయం చేస్తున్నందుకు నేను నిజంగా గర్విస్తున్నాను' అని తెలిపారు.
బాలీవుడ్లో మానుషి ప్రవేశం కచ్చితంగా 2022లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న తొలి చిత్రాల్లో ఒకటిగా నిలువనుంది. యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించిన పృథ్వీరాజ్‌ను అత్యంత ప్రభావవంతమైన రాజకీయ వ్యూహకర్త జీవితం, కాలాల ఆధారంగా అతి పెద్ద టెలివిజన్ ఇతిహాసం చాణక్యకు మరియు భారతదేశంలో పలు అవార్డులు గెలుచుకున్న పింజర్కు దర్శకత్వం వహించిన డా.చంద్రప్రకాష్ ద్వివేది ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పృథ్వీరాజ్ జనవరి 21, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.