Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంపూర్ణేష్‌బాబు తాజాగా నటించిన చిత్రం 'క్యాలీ ఫ్లవర్'. 'శీలో రక్షతి రక్షిత:' అనేది ఉపశీర్షిక. గుడూరు శ్రీధర్ సమర్పణలో మధు సూదన క్రియేషన్స్, రాధాకష్ణా టాకీస్ పతా కాలపై ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్కే మలినేని దర్శకుడు. ఈ చిత్రాన్ని ఈనెల 26న థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.
ఈ సందర్భంగా సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ, 'ఒక మగాడి శీలం పోతే దాని కోసం చేసే పోరాటమే క్యాలీ ఫ్లవర్ కథ. ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. అందర్నీ నవ్వించే సినిమా' అని చెప్పారు. 'మొదటిసారిగా సంపూర్ణేష్ బాబుతో పని చేశాను. నన్ను నమ్మి ఈ పాత్రను ఇచ్చినందుకు దర్శకుడికి థ్యాంక్స్' అని హీరోయిన్ వాసంతి అన్నారు