Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెంకటేష్ హీరోగా, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం 'దశ్యం 2'. ఈ చిత్రాన్ని ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు కలిసి సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్, మ్యాక్స్ మూవీస్ బ్యానర్ల పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సూపర్ హిట్ థ్రిల్లర్ 'దశ్యం' చిత్రానికిది సీక్వెల్. ఈనెల 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ, 'ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఇలాంటి ఫ్యామిలీ థ్రిల్లర్ ఈ మధ్యకాలంలో రాలేదు. అందరికీ రాంబాబు క్యారెక్టర్ బాగా నచ్చుతుంది. ముఖ్యంగా రాంబాబు లాంటి తండ్రి ప్రతి ఇంట్లో ఉండాలి' అని చెప్పారు. 'రాజమౌళి నుంచి మాస్టర్ పీస్ అనే కాంప్లిమెంట్ రావడం నమ్మలేకపోయాను. 'దృశ్యం' మాదిరిగానే పెద్ద హిట్ అవుతుంది' అని దర్శకుడు అన్నారు. నిర్మాత రాజ్‌కుమార్ సేతుపతి మాట్లాడుతూ, 'ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఫ్యామిలీ థియేటర్‌కు వచ్చి సినిమా చూసే పరిస్థితి లేదు. అందుకే ప్రతి ఇంటికి సినిమా చేరేందుకు అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేస్తున్నాం' అని తెలిపారు.