Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రక్షిత్ అట్లూరి హీరోగా అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న సినిమా 'శశివదనే'. కోమలీ ప్రసాద్ కథానాయిక. సాయి మోహన్ ఉబ్బన దర్శకుడు. గౌరీ నాయుడు సమర్పణలో ఎస్వీఎస్ కన్స్ట్రక్షన్స్ ప్రై.లి. భాగస్వామ్యంతో ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. మంగళవారం ఈ సినిమా పూజతో ప్రారంభ మైంది. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకులు మారుతి క్లాప్ ఇచ్చారు. సంగీత దర్శకులు రఘు కుంచె కెమెరా స్విచ్చాన్ చేశారు.
ఈ సందర్భంగా హీరో రక్షిత్ మాట్లాడుతూ, 'తేజ చాలా ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్. దర్శకుడు సాయికి అద్భుతమైన విజన్ ఉంది. ఇదొక మంచి ప్రేమకథ' అని చెప్పారు. 'టైటిల్‌కి టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్లకు ఇదే తొలి సినిమా. డిసెంబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభించడానికి ఎగ్జైటెడ్‌గా ఉన్నాం' అని నిర్మాత అన్నారు.
దర్శకుడు సాయి మోహన్ ఉబ్బన మాట్లాడుతూ, ''నా ఫస్ట్ మూవీ ఇది. మంచి కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం' అని తెలిపారు. 'ఈ ప్రాజెక్ట్ నాకు చాలా స్పెషల్. మంచి సినిమాలో నటిస్తున్నాననే నమ్మకంతో ఉన్నాను' అని నాయిక కోమలీ ప్రసాద్ అన్నారు.