Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'పోస్టర్'. శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్ పై టి.మహిపాల్ రెడ్డి (టి.యం.ఆర్) దర్శకత్వం వహించారు. టి. శేఖర్ రెడ్డి, ఎ. గంగారెడ్డి, ఐ.జి. రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మంగళవారం ప్రసాద్ ల్యాబ్స్‌లో చిత్ర ప్రీ- రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా జరిపారు.
ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ, 'ట్రైలర్, పాటలు చూశాక సినిమా చూడాలనే ఆసక్తి పెరిగింది' అని అన్నారు.నిర్మాత టి.శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, 'కథ నచ్చడంతోపాటు దర్శకుడు మహిపాల్ కోసం ఈ సినిమా నిర్మించాను' అని తెలిపారు.
'ఇదొక అందమైన ప్రేమకథ. ముఖ్యంగా ప్రతి తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూలో తన కొడుకు భవిష్యత్తు గురించి ఎంత తపన పడతాడో తెలిపే కథ, అలానే కొడుకు కూడా తన తండ్రి తపన ఏంటో చెప్పే కథ. యూత్‌కి ఓ ఉన్నత మార్గాన్ని చూపించే కథ. క్లాస్, మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది' అని దర్శకుడు టి.మహిపాల్ రెడ్డి అన్నారు. హీరో విజరు ధరణ్ మాట్లాడుతూ, 'హీరోగా ఎస్టాబ్లిష్ అవుతున్న ఈ స్టేజ్‌లో నాకు ఇలాంటి కథ దొరకడం అదష్టం' అని చెప్పారు.