Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పన్నారాయల్ దర్శకత్వంలో తాజాగా రూపొందిన చిత్రం 'ఇంటి నెం.13'. మిస్టరీ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రీగల్ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై హేసన్ పాషా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది.
ఈ సందర్భంగా దర్శకుడు పన్నా రాయల్ మాట్లాడుతూ, 'అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఓ మిస్టరీ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. టెక్నికల్‌గా హై రేంజ్లో ఉండాలని హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో ఓ విజువల్ వండర్లా రూపొందిస్తున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ యాజమాన్య అద్భుతమైన పాటలు చేశారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంతకంటే బాగా చేస్తారన్న నమ్మకం ఉంది. ఖర్చుకు వెనకాడకుండా ఎంతో లావిష్‌గా ఈ చిత్రాన్ని నిర్మాత హేసన్ పాషా నిర్మిస్తున్నారు. 'కాలింగ్ బెల్', 'రాక్షసి' సినిమాల తర్వాత ఈ సినిమా నాకు హ్యాట్రిక్ హిట్ అందిస్తుందన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నాను' అని అన్నారు.
'పన్నాగారు ఇంతకుముందు చేసిన రెండు సినిమాలు చూశాను. నాకు చాలా బాగా నచ్చాయి. ఈ మధ్యకాలంలో రాని ఓ డిఫరెంట్ పాయింట్‌తో సినిమా చేస్తే బాగుంటుందని మేం అనుకున్నాం. పన్నాగారు చెప్పిన పాయింట్‌తో సినిమా చేస్తే డెఫినెట్‌గా సూపర్‌హిట్ అవుతుందన్న నమ్మకం కలిగింది. ఫుటేజ్ చూసిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. ఆసాంతం ఎంతో ఇంట్రెస్టింగ్గా సినిమాని నడిపించడంలో పన్నాగారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధించి మా రీగల్ ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రతిష్టను పెంచుతుందని ఆశిస్తున్నాను. అలాగే దర్శకుడు పన్నాగారికి హ్యాట్రిక్ హిట్ అవుతుందనే నమ్మకమూ ఉంది' అని నిర్మాత హేసన్ పాషా తెలిపారు.