Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై సాయి రోనక్, నేహ సోలంకి హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం 'ఛలో ప్రేమిద్దాం'. సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వంలో ఉదరు కిరణ్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 19న గ్రాండ్‌గా విడుదలకు సిద్దమైంది. ఈ సందర్భంగా బుధవారం ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ, 'ట్రైలర్ కలర్ ఫుల్‌గా ఉంది. పాటలూ బావున్నాయి. సాయి రోనక్, నేహ సోలంకి జంట ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుంది. ఈ చిత్రం ఘన విజయం సాధించి నిర్మాతలకు మంచి లాభాలు, యూనిట్ అందరికీ మంచి గుర్తింపు రావాలి' అని చెప్పారు.
'మా బ్యానర్లో వస్తున్న మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. పాటలకు, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నెల 19న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. ప్రేక్షకులు మా చిత్రాన్ని పెద్ద సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాం' అని నిర్మాత ఉదరు కిరణ్ తెలిపారు. దర్శకుడు సురేష్ శేఖర్ రేపల్లె మాట్లాడుతూ, 'నేను ఈ రోజు ఈ వేదిక మీద ఉన్నానంటే కారణం మా నిర్మాత ఉదరు కిరణ్ గారు. ఎక్కడా రాజీ పడకుండా సినిమాని చాలా రిచ్‌గా తీయడానికి సహకరించారు. ఇదొక లవ్ అండ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది' అని చెప్పారు. 'ట్రైలర్‌కు, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. క్యూట్ లవ్ స్టోరితో పాటు థ్రిల్లింగ్ అంశాలు ఉంటాయి. దర్శకుడు చాలా కొత్తగా తీసే ప్రయత్నం చేశారు. అన్ని ఎమోషన్స్ ఉన్న ఇలాంటి కమర్షియల్ సినిమాని థియేటర్లో చూస్తేనే కిక్ ఉంటుంది' అని హీరో సాయి రోనక్ అన్నారు. హీరోయిన్ నేహ సోలంకి, గీత రచయితలు సురేష్ గంగుల, దేవ్ పవార్, కొరియోగ్రాఫర్ వెంకట్ దీప్ తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.