Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామ్ అగ్నివేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఇక్షు. డా.అశ్విని నాయుడు నిర్మించిన ఈ చిత్రానికి రుషిక దర్శకత్వం వహించారు. తమిళం, తెలుగుతోపాటు ఐదు భాషల్లో ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాణాల కోసం పోరాడుతున్న యువతను ధైర్యంగా కాపాడిన పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీమతి రాజేశ్వరి ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో దర్శకురాలు రుషిక మాట్లాడుతూ, 'ఇది నా మొదటి సినిమా. యదార్థ సంఘటనను ప్రధానంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. ఇదొక ఫ్యామిలీ థ్రిల్లర్. ఈ సినిమాని ఐదు భాషల్లో విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది' అని తెలిపారు. 'పోలీసు శాఖ ఉంది మీ సేవ కోసమే. మీరు నిర్భయంగా మా దగ్గరికి రండి. దీనికి ఎవరి మద్దతు అవసరం లేదు. ఈ సినిమా టీజర్ చాలా బాగుంది. అందరూ ఈ సినిమాని చూసి, ఆదరించండి' అని ఇన్స్పెక్టర్ రాజేశ్వరి అన్నారు.
నిర్మాత కె.రాజన్ మాట్లాడుతూ, 'నిర్మాత అశ్విని నాయుడు 5 భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఓ మంచి కాన్సెప్ట్‌తో దర్శకురాలు ఋషిక అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తీశారు' అని చెప్పారు.