Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నరేన్, దీపాలి శర్మ జంటగా నటించిన సినిమా 'ఊరికి ఉత్తరాన'. ఈగల్ ఐ ఎంటైర్ టైన్మెంట్స్ బ్యానర్ పై వనపర్తి వెంకటయ్య, రాచాల యుగంధర్ నిర్మించారు. సతీష్ అండ్ టీమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 19న థియేటర్లలో విడుదలవుతోంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో దర్శకుడు సతీష్ మాట్లాడుతూ, 'ఈ సినిమా టెక్నికల్‌గా బాగుందంటే ఆ క్రెడిట్ మా సాంకేతిక నిపుణులకు దక్కుంది. అలాగే రైటర్స్ ఆకట్టుకునేలా మాటలు రాశారు. సినిమా బాగా వచ్చింది. నేను కథ చెప్పిన దగ్గర్నుంచి, నన్ను నమ్మి, నేను అనుకున్నట్లు సినిమా చేసేలా హీరో నరేన్ ప్రోత్సహించారు. ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది' అని తెలిపారు.
'టాలీవుడ్లో చిన్న సినిమాలకు ఎన్ని కష్టాలుంటాయో మీకు తెలుసు. మేమూ ఆ ఇబ్బందులన్నీ పడ్డాం. ఫైనల్‌గా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. అలాగే ఈ సినిమా సక్సెస్ మీట్ కోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే సినిమా మీద అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. మేం ఎందుకు ఇంత ఆత్మవిశ్వాసంతో ఉన్నామనేది సినిమా రిలీజ్ అయ్యాక మీకే తెలుస్తుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ ఇది. సినిమా కోసం వేసిన వరంగల్ సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మంచి కంటెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమా హిట్ ఖాయం' అని హీరో నరేన్ చెప్పారు. హీరోయిన్ దీపాలి శర్మ మాట్లాడుతూ, 'ఇది రెగ్యులర్‌గా చూసే లవ్ స్టోరి కాదు. చాలా కొత్త కథ. ఆహ్లాదకరమైన విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఉంటుంది. శైలు అనే క్యారెక్టర్లో నటించా. ఈ పాత్రను మా దర్శకుడు సతీష్ అందంగా తెరకెక్కించారు. నా క్యారెక్టర్ మాత్రమే కాదు సినిమాలో ప్రతి పాత్ర అద్భుతంగా ఉంటుంది. మా సినిమా ఆదరించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.