Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమర్ దీప్, తన్వి నెగ్గి, ఎస్తేర్, అరుణ్ కుమార్, రవీంద్ర, సంజరు నాయర్ జయ వాహిని నటీనటులుగా రూపొందుతున్న చిత్రం 'ఐరావతం'. రేఖ పలగాని సమర్పణలో నూజివీడు టాకీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. సుహాస్ మీరా దర్శకత్వంలో రాంకీ పలగాని, లలిత కుమారి తోట, బాలయ్య చౌదరి నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సుహాస్ మీరా మాట్లాడుతూ,'ఒక వినూత్నమైన కథతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా. ఓ మంచి సినిమా కోసం నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా నిర్మించినందుకు ధన్యవాదాలు' అని తెలిపారు.
'ఈ చిత్ర కథలోని ఇంటెన్సిటీ తగ్గకుండా, జనాదరణ పొందే విధంగా నిర్మాణ విలువలతో నిర్మించాం. మా దర్శకుడు ఏదైతే కథ చెప్పారో, దాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. నటీనటుల నటన, సాంకేతిక నిపుణుల పనితనం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. ఇది కచ్చితంగా ప్రేక్షకాదరణ పొందే చిత్రమవుతుందని ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్‌కి వస్తున్న స్పందనే తెలియజేస్తోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి, త్వరలోనే సినిమాని విడుదల చేస్తాం' అని నిర్మాతలు అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ : రేఖ పలగాని, ఎడిటర్ సురేష్ దుర్గం, సినిమాటోగ్రఫీ: ఆర్.కె.వల్లపు, సంగీతం: సత్యా కశ్యప్, నిర్మాతలు : రాంకీ పలగాని, లలిత కుమారి తోట, బాలయ్య చౌదరి, రచన-దర్శకత్వం: సుహాస్ మీరా.