Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూవీ మాక్స్ బ్యానర్ పై తాన్య దేశారు, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ నటీనటులుగా రూపొందిన చిత్రం 'స్ట్రీట్ లైట్'. విశ్వ దర్శకత్వంలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ మామిడాల శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
నేడు (శుక్రవారం) ఈ చిత్రం 150 థియేటర్స్‌లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ, 'సినిమా చాలా బాగా వచ్చింది. డిస్ట్రిబ్యూటర్స్ మాకు సపోర్ట్ చేయడంతో 150 థియేటర్లు దొరికాయి. ఒక రాత్రి స్ట్రీట్ లైట్ క్రింద ఏం జరిగిందనే ఆసక్తికర అంశంతోపాటు ఓ యువతి తనకి జరిగిన అన్యాయానికి ఏవిధంగా ప్రతీకారం తీర్చుకుంది అనే రివెంజ్ డ్రామాతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. మంచి మేకింగ్ వ్యాల్యూస్‌తో వైవిధ్యభరితమైన సినిమాని రూపొందించినందుకు సెన్సార్ సభ్యులు అభినందించారు. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం ఉంది' అని అన్నారు.