Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇండియన్ ఐడల్ 12 టాప్ ఫైవ్ ఫైనలిస్ట్స్‌తో డిసెంబరు 18న హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో 'ఫాబ్లోస్ 5' పేరుతో భారీ స్థాయిలో లైవ్ కాన్సర్ట్ జరగనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రసాద్‌ల్యాబ్స్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో 'ఫాబ్లోస్ 5' పేరుతో జరిగే లైవ్ కాన్సర్ట్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఇండియన్ ఐడల్ సింగర్స్ పవనదీప్, అరుణిత, సైలి, డానిష్‌తోపాటు తెలుగు రాక్‌స్టార్ షణ్ముఖ ప్రియ కలిసి ఈ లైవ్ కాన్సర్ట్‌లో ప్రేక్షకులను అలరించబోతున్నారు.
ఈ సందర్భంగా ఈవెంట్ నిర్వహకులు మాట్లాడుతూ,'ఒకే వేదిక పై ఐదుగురు సింగర్స్ కలిసి పాడటం చాలా కష్టం. అలాగే ఇండియన్ ఐడల్ సింగర్స్ పాడటం ఇండియాలో ఇదే మొట్టమొదటి షో కావడం విశేషం. ఈ కాన్సర్ట్ ఒక సంగీత మహోత్సవంలా జరగనుంది. మన తెలుగు రాక్‌స్టార్ షణ్ముఖ ప్రియ తన పాటలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కానుంది. ఈ కాన్సర్ట్‌ని ఎలెవన్ పాయింట్ టూ, మెటలోయిడ్ ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నారు' అని తెలిపారు.