Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని నటిస్తున్న 'శ్యామ్ సింగ రారు' సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1 వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. రాహుల్ సంకత్యాన్ దర్శకుడు. సాయిపల్లవి, కతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లు. డిసెంబర్ 24న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. గురువారం ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కథా రచయిత సత్యదేవ్ జంగా మాట్లాడుతూ,'విప్లవాత్మక ప్రేమ గాథ. రెండు భిన్న ధవాలు. విప్లవం మనసుది. ప్రేమ హదయానిది. ఈ రెండు కలగలిపే కథే ఈ సినిమా. ఇదొక అద్భుత దశ్య కావ్యం' అని అన్నారు. 'టీజర్ చూసిన తర్వాత మీ రియాక్షన్ చూసి నాకే ఏదో వచ్చింది. ఇప్పుడే ఇలా ఉంటే థియేటర్లో సినిమా చూస్తే ఇంకా ఎలా ఉంటుంది?, నేను కూడా నాని అభిమానినే. థియేటర్లో సినిమా చూసేందుకు ఎదురుచూస్తున్నాను. మీరు ఇప్పుడు చూసింది వంద సెకన్లే. సినిమాలో అంతకు మించి ఉంటుంది' అని డైరెక్టర్ రాహుల్ సంకత్యాన్ తెలిపారు.
నాని మాట్లాడుతూ, 'రెండేళ్ల తరువాత థియేటర్‌కు వస్తున్నామంటే ఈ మాత్రం ఉండాలి కదా?..కరెక్ట్ సినిమాతో వస్తున్నాను. క్రిస్మస్ మాత్రం మనదే. మంచి టీం దొరికినప్పుడు ఎలాంటి సినిమా వస్తుందో చెప్పడానికి ఈ సినిమా ఉదాహరణగా నిలిచిపోతుంది. ఇంత మంచి చిత్రాన్ని తీసినందుకు నిర్మాత వెంకట్ గారికి థ్యాంక్స్. ఇదొక ఎపిక్ లవ్ స్టోరీ. శ్యామ్ అమ్మ తెలుగు. నాన్న బెంగాలి. కథ విన్నప్పుడు నాకు బాగా నచ్చింది. సాయి పల్లవితో ఇది వరకే 'ఎంసీఏ'తో హిట్ వచ్చింది. హిట్ కాంబినేషన్‌గా మేం చాలా సినిమాలు చేయాలి. ఇప్పటి నుంచి ప్రతీ సినిమాలో ఇది వరకు చూడని నానినే చూస్తారు. టీజర్ కంటే సినిమా వంద రెట్లు ఉంటుంది. మీ ఎనర్జీని దాచి పెట్టుకోండి' అని చెప్పారు.