Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అందరూ కూర్చుని ఎంజాయ్ చేసే చిత్రాలను చేయబోతున్నా. కొత్త దర్శకులతో పని చేస్తున్నా. ఇలాంటి చిత్రాలే చేయలని అనుకోను. 'దశ్యం'కి మూడో పార్ట్ ఉంటుందో లేదో నాకు తెలీదు. అయితే ఈసారి మాత్రం చాలా టైం పడుతుందని మాత్రం చెప్పారు. మూడు, నాలుగేళ్లు పట్టొచ్చు. దాంట్లో నేను తెల్లగడ్డంతో కనిపించినా ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదు' అని అంటున్నారు కథానాయకుడు వెంకటేష్. ఆయన కథానాయకుడిగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'దశ్యం 2'. ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు కలిసి సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్, మ్యాక్స్ మూవీస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. సూపర్ హిట్ థ్రిల్లర్ 'దశ్యం' చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 25న అమెజాన్ ప్రైమ్‌లో డైరెక్ట్‌గా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో గురువారం హీరో వెంకటేష్ మీడియాతో ముచ్చటించారు.
ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
'దృశ్యం' చిత్రానికి సీక్వెల్ చేస్తే సినిమా హిట్ అవుతుందా? లేదా? అని అందరిలోనూ కొన్ని అనుమానాలుంటాయి. కానీ జీతూ మాత్రం మొదటి పార్ట్ కంటే అద్భుతంగా స్క్రిప్ట్ రాశారు.
ఇందులో ఫ్యామిలీ కోసం రాంబాబు ఏదైనా చేస్తాడు.
అది తప్పా.. ఒప్పా అని ఆలోచించడు. తన ఫ్యామిలీని కాపాడుకోవడమే రాంబాబు లక్ష్యం. అలాంటి పాత్రలో మళ్లీ నటించడం ఆనందంగా ఉంది.
రాంబాబు ఇన్ని రకాలుగా ఆలోచిస్తాడా? అని జనాలు అనుకుంటారు. అంతా బాగుందని అనుకునే సమయంలో ఆరేళ్ల తరువాత ఇన్వెస్టిగేషన్ మొదలవ్వడం, మళ్లీ సమస్యలు రావడం.. ఒక్కమాటలో చెప్పాలంటే ఇదొక సిట్ ఎడ్జ్ థ్రిల్లర్. ఏం జరిగిందనేది రాంబాబు ఫ్యామిలీకి కూడా చెప్పడు. ఫ్యామిలినీ రక్షించడం మాత్రం తెలుసు. ఇది చాలా గొప్ప పాత్ర. దీన్ని మోహన్‌లాల్ అద్భుతంగా చేశారు.
సినిమాలు తీశామా?, రిలీజ్ చేశామా అంతే.. ఎంజారు చేసే వాళ్లు ఎంజారు చేస్తారు. ఇలాంటి చిత్రాలు ఎన్ని సార్లు చూసినా చూడాలని అనిపిస్తుంది. ఎంత మంది చూస్తారు అని కాదు. ఈ సినిమా బడ్జెట్‌కు ఓటీటీ బెస్ట్ అని నిర్మాతలు అనుకున్నారేమో. అందుకే డైరెక్ట్‌గా అమెజాన్‌లో రిలీజ్ చేస్తున్నారు. అయితే నా అభిమానులు కొంచెం హర్ట్ అవుతారేమో కానీ, నెక్ట్స్ సినిమాలతో థియేటర్లోకి వస్తానని వాళ్లకీ తెలుసు. అన్నింటికి ఓపిగ్గా ఉండాలి. పాజిటివ్‌గా ఆలోచించాలి. ఈసారి ఇలా జరిగిందంతే.
అయితే ఓటీటీలో నా సినిమాలు రిలీజ్ అవుతున్నాయనే బాధ 'ఎఫ్ 3' సినిమాతో పోతుంది. ఫుల్‌గా ఎంజారు చేస్తారు. 'ఎఫ్ 3' డబ్బు చుట్టూ తిరిగే సినిమా. ప్రతి ఒక్కరికీ అదే అవసరం కదా..అందుకే తప్పకుండా కనెక్ట్ అవుతుంది. దాదాపు షూటింగ్ పూర్తయింది. సమ్మర్లో రిలీజ్‌కి ఛాన్స్‌లున్నాయి. ప్రస్తుతం రెండు, మూడు కథలు రెడీ అవుతున్నాయి. ఇంకా ఏ సినిమాకి ఓకే చెప్పలేదు. ఇమేజ్ గురించి ఆలోచించను.. వచ్చిన సినిమాని చేస్తానంతే.
రానాతో కలిసి నెట్ఫ్లిక్ కోసం ఒక సినిమా చేస్తున్నాను. ఆ సినిమాలో ఒక డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తాను. షూటింగ్ కూడా మొదలైంది. ప్రస్తుతం 'ఎఫ్3', 'రానా నాయుడు' షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాను.