Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంపూర్ణేష్‌బాబు తాజాగా నటిస్తున్న చిత్రం 'క్యాలీ ఫ్లవర్'. 'శీలో రక్షతి రక్షిత:' అనేది ఉపశీర్షిక. ఆర్కే మలినేని దర్శకుడు. గుడూరు శ్రీధర్ సమర్పణలో మధు సూదన క్రియేషన్స్, రాధాకష్ణా టాకీస్ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా కథానాయిక వాసంతి మీడియాతో మాట్లాడుతూ,'నేను తెలుగమ్మాయిని. కానీ బెంగళూరులో పెరిగాను. కన్నడలో ఐదు సినిమాలు చేశాను. మొదట్లో ఈ సినిమా చేయాలా? వద్దా అని భయపడ్డాను. అయితే తెలుగులో తొలి సినిమా యూనిక్‌గా ఉందని గ్రీన్‌సిగల్ ఇచ్చాను.
ఇందులో నీలవేణి పాత్రకు నేను కరెక్ట్‌గా సరిపోతానని దర్శక, నిర్మాతలు నన్ను ఎంపిక చేశారు. బావ వెంటపడుతూ చలాకీగా తిరిగే అమ్మాయి నీలవేణి. ఈ పాత్ర నా కోసమే డిజైన్ చేసినట్టు అనిపించింది. పక్కింటి అమ్మాయిలా కనిపిస్తాను. సినిమా అంతా లంగావోణిలో అలరిస్తాను. ఈ సినిమా తర్వాత తెలుగు ప్రేక్షకులకు నీలవేణిగా గుర్తుండిపోతాననే నమ్మకం ఉంది. సంపూ పాత్రలో రెండు వేరియేషన్లుంటాయి. క్యాలీఫ్లవర్ క్యారెక్టర్‌కు నేను మరదల్ని. ఆయన వెంట పడుతూనే ఉంటాను. కానీ ఆయన నన్ను పట్టించుకోరు. అయితే ఈ సినిమాకి 'క్యాలీఫ్లవర్' అని ఓ వెజిటబుల్ పేరు పెట్టారేంటి? అని అనుకున్నాను. కానీ పోస్టర్ రిలీజ్ చేశాక, షాక్ అయ్యాను. సంపూ గారికి ఈ టైటిల్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. ఆర్కే గారు సీరియల్స్‌లో చాలా సీనియర్ డైరెక్టర్. ఆయనతో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ఆసాంతం వినోదాత్మకంగా ఉంటుంది' అని చెప్పారు.