Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీనియర్ నటుడు, నిర్మాత కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉందని అపోలో హాస్పిటల్ వైద్యులు శనివారం సాయంత్రం తెలిపారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని, మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో, చికిత్సకు ఆశించినంత స్థాయిలో కైకాల స్పందించటం లేదు అని కైకాల ఆరోగ్య పరిస్థితికి సంబంధించి డాక్టర్ల బృందం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు.
ఇంట్లో జారిపడటంతో కైకాలను ఆయన కుటుంబ సభ్యులు గత నెల 30న హాస్పిటల్లో జాయిన్ చేశారు. అప్పట్నుంచి ఆయనకు చికిత్స కొనసాగుతూనే ఉంది. అయితే శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత సీరియస్‌గా ఉంది. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు, పరిశ్రమ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన సురక్షితంగా ఇంటికి చేరాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెట్టారు. దాదాపు 750 చిత్రాల్లో నటించిన కైకాల 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'మహర్షి' చిత్రాల తర్వాత వెండితెరకు దూరంగా ఉన్నారు.