Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తిక్ రాచపూడి, సంయుక్త గాలి జంటగా రూపొందుతున్న చిత్రం 'వార్మెన్ బేస్ -51'. కిగోర్ దర్శకత్వంలో కేఆర్ మీడియా అండ్ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కు విజన్ మ్యాజిక్ సీఈఓ సాంబశివరావు క్లాప్ కొట్టగా, నిర్మాత రాచపూడి మాధురి కెమెరా స్విచ్చాన్ చేేశారు. దర్శకుడు కిగోర్ ఫస్ట్ షాట్‌ని డైరెక్ట్ చేశారు. ఈ సందర్భంగా హీరో కార్తిక్ రాచపూడి మాట్లాడుతూ,'ఇలాంటి డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. దర్శకుడు కిగోర్ మంచి స్క్రిప్ట్ రాశారు. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా' అని తెలిపారు.
'ఇంత మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు థ్యాంక్స్' అని నాయిక సంయుక్తగాలి చెప్పారు. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ, 'ఈ సినిమాకి మంచి స్క్రిప్ట్ కుదిరింది. కార్తిక్, సంయుక్త పాత్రలు కొత్తగా ఉంటాయి. వాళ్ళ నటనకు మంచి స్కోప్ ఉంది. తప్పకుండా వారిద్దరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ విశ్వ కీలకపాత్రలో నటిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పూర్తయ్యింది. ఈ నెలాఖరు నుండి చిత్రీకరణ ప్రారంభిస్తాం' అని అన్నారు. ఈ చిత్రానికి డిఓపి - దర్శకత్వం: కిగోర్.