Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై సాయి రోనక్, నేహ సోలంకి హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'ఛలో ప్రేమిద్దాం'. సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వంలో ఉదరు కిరణ్ నిర్మించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ థియేటర్ల సంఖ్యని పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆదివారం సంస్థ కార్యాలయంలో చిత్ర బృందం సక్సెస్ మీట్‌ని ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా నిర్మాత ఉదరు కిరణ్ మాట్లాడుతూ, 'మా చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందంటే మా ఆర్టిస్ట్స్లు, టెక్నీషియన్లే కారణం. అందరూ సిన్సియర్ ఎఫర్ట్ పెట్టారు. ఈ సినిమా సక్సెస్ మరెన్నో సినిమాలు చేయడానికి నాకు మంచి బూస్టప్ ఇచ్చింది' అని తెలిపారు.
'విడుదలైన అన్ని ఏరియాల నుంచి మా చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా పాటలు, నేపథ్య సంగీతం, దర్శకత్వం, కామెడీ, నిర్మాణ విలువలు సినిమాకి ప్లస్ అంటున్నారు. ఆడియన్స్‌తో కలిసి సినిమా చూశాను. అదుర్స్ రఘు కామెడీ, పోసాని, హేమ మధ్య వచ్చే ఫన్, అత్తారింటికి దారేది ఎపిసోడ్‌కు ఆడియన్స్ పడి పడి నవ్వుతున్నారు. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్, శశాంక్, నాగినీడు, సిజ్జు పాత్రలు సినిమాకు హైలెట్ అంటున్నారు. వర్షాల్లో కూడా మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు' అని దర్శకుడు సురేష్ శేఖర్ రేపల్లె చెప్పారు. హీరో సాయి రోనక్ మాట్లాడుతూ, 'అందరూ నా పర్ఫార్మెన్స్, డాన్స్ గురించి మాట్లాడుతున్నారు. సినిమా బావుందంటూ చాలా మంది కాల్స్ చేసి, చెబుతుంటే హ్యాపీగా ఉంది. ఇంత మంచి హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్' అని అన్నారు.
అదుర్స్ రఘు, అక్షఖాన్, జబర్దస్త్ పవన్, కొరియోగ్రాఫర్ వెంకట్ తదితరులు తమ విజయానందాన్ని షేర్ చేసుకున్నారు.