Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్ కథానాయకులుగా నటించిన చిత్రం 'రామ్ అసుర్'. ఈ చిత్రానికి వెంకటేష్ త్రిపర్ణ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించడంతోపాటు దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా సహ నిర్మాత ఆర్కే మాట్లాడుతూ,'మా సినిమాకు ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మేమిప్పుడు మంచి సక్సెస్ జోష్‌లో ఉన్నాం' అని చెప్పారు. 'అందరూ ఈ సినిమాను ఎంతో మెచ్చుకుంటున్నారు. క్రిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కలెక్షన్స్ పాయింట్ అఫ్ వ్యూలోనూ మా సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది. భారీ వర్షాల్లో కూడా ప్రేక్షకులు మా సినిమాను వీక్షిస్తున్నారంటే సినిమా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు' అని దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణ అన్నారు.
హీరో అభినవ్ సర్దార్ మాట్లాడుతూ,'మా సక్సెస్ టూర్లో భాగంగా కొన్ని సిటీస్‌కి వెెళ్లి ఆడియన్స్‌తో సినిమా చూసి, వారితో కలిసి ఎంతో ఎంజారు చేశాం. ఆ రెస్పాన్స్ మేం ఎప్పటికీ మర్చిపోలేనిది. వెంకటేష్ త్రిపర్ణ డైరెక్షన్, ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, భీమ్స్ సంగీతం.. ఇవన్నీ సినిమా సక్సెస్‌లో కీ రోల్ ప్లే చేశాయి' అని చెప్పారు.