Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన భారీ చిత్రం 'మరక్కార్'. 'అరేబియా సముద్ర సింహ' అనేది ఉప శీర్షిక. ప్రియదర్శన్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేయబోతున్నారు.
ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ మీద ఎన్నో మంచి చిత్రాలను నిర్మించి, రెండు సార్లు జాతీయ అవార్డు అందుకున్న ఆంటోని పెరంబువూర్ ఈ చిత్రాన్ని కాన్ఫిడెంట్ గ్రూప్ సంస్థతో కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
'మోహన్‌లాల్‌కు తెలుగులో ఉన్న పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే. ఇటీవల ఆయన హీరోగా రూపొందిన 'మన్యం పులి' సినిమా తెలుగులో సూపర్ హిట్ అయింది. అలాగే ఆయన తెలుగులో నటించిన 'జనతా గ్యారెజ్'తో పాటు పలు సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. తెలుగునాట ఆయనకంటూ ఓ ప్రత్యేక అభిమానగణమూ ఉంది. తాజాగా ఆయన నటించిన 'మరక్కర్' చిత్ర తెలుగు హక్కులను టాలీవుడ్ నెంబర్ వన్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. తెలుగులో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేసేందుకు సురేష్ ప్రొడక్షన్స్ సన్నాహాలు చేస్తోంది. అర్జున్, సునీల్ శెట్టి, కిచ్చా సుదీప్, ప్రభు, మంజు వారియర్, కీర్తి సురేష్, కళ్యాణి ప్రియదర్శన్, నిత్యామీనన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రొన్నీ రాఫెల్ సంగీతాన్ని అందించారు. ఇటీవల విడుదల చేసిన 'కనులను కలిపినా..' మొదటి పాటకు విశేషమైన స్పందన లభించింది' అని చిత్ర బృందం పేర్కొంది.