Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం '1997'. డా.మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమైంది. ఈ నెల 26న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమాలో అవినీతి పోలీస్ అధికారిగా నటించిన శ్రీకాంత్ అయ్యంగార్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ, 'కుల వివక్ష, వర్ణ వివక్షతోపాటు ప్రస్తుతం మన సమాజంలో ఉన్న క్రైమ్ రేట్.. ఇలాంటి అంశాల నేపథ్యంలో సినిమా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మన సమాజంలో ఉన్న ఆరాచకాన్ని ఆవిష్కరించే సినిమా ఇది. మన సిస్టంలో ఎలాంటి లోపాలు ఉన్నాయి?, సామాన్య మనుషులకు న్యాయం ఎక్కడ జరుగుతుందనే పాయింట్ అప్ వ్యూలో ఈ సినిమా ఉంటుంది. ఇందులో నేను కరెప్టెడ్ పోలీస్ అధికారిగా కనిపిస్తాను. నా పాత్రకు డబ్బింగ్ చెబుతున్నప్పుడు ఇంత దరిద్రంగా మనుషులు ఉంటారా.. అని నాకే ఛీ అనిపించింది. నిజంగా ఒక నీచ పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తాను. ఈ పాత్ర నా వ్యక్తిత్వానికి భిన్నంగా ఉన్నప్పటికీ ఆ పాత్ర తాలూకు ప్రవర్తన చూసి నాకే అసహ్యం వేసింది. అంత నీచమైన పాత్ర. మోహన్‌గారు దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా నటుడిగా కూడా చక్కగా చేశారు. నాకు వచ్చిన అవకాశాల్లో పాజిటివ్‌తో పాటు నెగిటివ్ రోల్స్ కూడా చేశాను. నేను నటించిన పలు సినిమాలు ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి' అని తెలిపారు.