Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పూర్ణ ప్రధాన పాత్రలో, తేజ త్రిపురాన హీరోగా రూపొందిన చిత్రం 'బ్యాక్ డోర్'. ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై కర్రి బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్ర వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులను కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్ అధినేత, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత కందల కష్ణారెడ్డి సొంతం చేసుకున్నారు.ఈ చిత్ర విడుదలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శులు ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల, నిర్మాత ఆచంట గోపినాధ్, రావణలంక కథానాయకుడు క్రిష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్ అధినేత కందల కష్ణారెడ్డి మాట్లాడుతూ, 'ఈ చిత్రానికి ఉన్న క్రేజ్‌కి తగ్గట్టుగానే భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 3న విడుదల చేస్తున్నాం. ఈ సినిమా హక్కుల కోసం పలువురు పోటీ పడినప్పటికి, నా మీద నమ్మకంతో ఇచ్చినందుకు ఈ చిత్ర నిర్మాత బి.శ్రీనివాస్ రెడ్డి, దర్శకుడు కర్రి బాలాజీలకు థ్యాంక్స్. దర్శకుడిగా ఈ చిత్రం బాలాజీకి చాలా మంచి పేరు తీసుకురావడం ఖాయం' అని చెప్పారు.
''అఖండ' చిత్రంలో మంచి పాత్ర పోషించిన పూర్ణ నటించిన ఈ సినిమా 'అఖండ'తోపాటు విడుదలవుతుండటం నిర్మాతలకు కలిసివచ్చే అంశం. అలాగే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న నెల్లూరు కష్ణారెడ్డి అగ్ర కథానాయకుడు బాలయ్యకు వీరాభిమాని కావడం విశేషం. 'బ్యాక్ డోర్' కూడా అఖండ ఆదరణ పొందడం ఖాయమని అతిథులు ఆకాంక్షించారు.